ఆదిలాబాద్, మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం
ఎసన్వాయి గ్రామంలో గుడుంబా తయారీ, విక్రయాలపై పోలీస్, ఎక్సైజ్ శాఖ సంయుక్త దాడులు జరిపారు. ఈ దాడుల్లో సరైన ధృవపత్రాలు లేని 35 వాహనాలను సీజ్ చేశారు. అయితే, గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసిన ఎక్సైజ్ పోలీసులు.. నిలువ ఉంచబడిన సుమారు 1,000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి, 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం 9 మందిపై కేసులు నమోదు చేశారు. గుడుంబా నిర్మూలనపై.. ఏసీపీ వెంకటేశ్వర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అలాగే, ఇలాంటి కార్యకాలపాలు చట్ట విరుద్ధమని, ఇందులో పాల్గొన్నవద్దని వారికి చెప్పడంతోపాటు, గుడుంబా తయారీలో పాల్గొన్నవారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని గ్రామస్తులను ఏసీబీ హెచ్చరించారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..





