గత రెండు సంవత్సరాలుగా వరస దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్‌గా మారిన నిందితులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. కేవలం జల్సా కోసమే ఈ దొంగతనాలు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. నిందితుల నుంచి చోరికి గురైన రూ.24 లక్షల విలువైన బంగారం, వెండి, నగదుతో పాటు చోరీకి ఉపయోగించిన బైక్ ,అయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా అళ్ళగడ్డ సబ్ డివిజన్లో గల కోవెలకుంట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గత రెండేళ్ళలో ఎనిమిది ఇండ్లలో చోరి జరిగింది. దొంగలు ఎలాంటి క్లూ లేకుండా చోరీలకు పాల్పడటం పోలీసులకు సవాల్‌గా మారింది.
ఈ కేసు ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు ఎంతో శ్రమించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితులను గుర్తించారు. కోవెలకుంట్ల శివారులో వారిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. అరెస్టు అయినవారంతా కోవెలకుంట్ల గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించారు. నిందితులు కేవలం జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ దొంగతనాలకు పాల్పడిన దుష్యంత్, ఇజిత్ కుమార్, బత్తుల విజయ్, ఉయ్యాలవాడ గుర్రప్ప, సంజామల శ్రీకాంత్ అంతా కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి చోరీలకు పాల్పడేవాళ్ళు. కేవలం కోవెలకుంట్లలోని ఇళ్లనే టార్గెట్ చేసేవాళ్లుగా తెలుస్తోంది. అందులోనూ తాళం వేసిన వాటిని గమనించి రాత్రి, పగలు అని తేడా లేకుండా పకడ్బందీగా చోరీకి పాల్పడేవాళ్లని జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి వెల్లడించారు. కేసు చేదించడంలో ప్రతిభ కనబరిచిన కోవెలకుంట్ల సిఐ జయచంద్ర, ఎస్ఐ వరప్రసాద్, రాజ్ కుమార్‌లను జిల్లా ఎస్పీ రివార్డులు ఇచ్చి ప్రోత్సహించారు.
వీడియో..
Also read
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..
- ATM: ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్..!
- దొంగను పట్టించిన చెప్పులు.. రెండు నెలల తర్వాత దొరికిన అసలైన క్లూ!





