బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో ఆభరణాల కోసం హత్యలు చోటు చేసుకుంటున్నాయి. తెనాలిలో జరిగిన ఘటన కలకలం రేపింది. తెనాలి మత్తింశెట్టి పాలెంకు చెందిన మల్లేశ్వరి టిఫిన్ బండి నడుపుకుంటూ జీవిస్తుంది. మల్లేశ్వరికి కుమార్తె ఉంది. అయితే ఆమె కుమార్తె వద్దకు వెళ్లకుండా ఒక్కతే నివసిస్తుంది. ప్రతి రోజూ తెల్లవారుజామున టిఫిన్ కోసం స్థానికులు మల్లేశ్వరి ఇంటి వద్దకు వస్తుంటారు. ఈ రోజు కూడా అలాగే కొంతమంది మల్లేశ్వరి ఇంటి వద్దకు వచ్చారు. అయితే మల్లేశ్వరి టిఫిన్ వేయలేదు. ఇంటి తలుపులు కూడా తీయలేదు. దీంతో స్థానికులు ఆమె కుతూరుకు సమాచారం ఇచ్చారు. హడావుడిగా ఇంటి వద్దకు వచ్చిన కుమార్తె తలుపులు తీసి లోపలికి వెళ్లింది. లోపల మంచం మీద తల్లిని చూడగానే అవాక్కైంది. ఒంటిపై దుస్తులు కూడా సరిగా లేవు.
శరీరంపై ఉండాల్సిన బంగారు ఆభరణాలు కూడా లేవు. దీంతో ఆందోళనకు గురైన కుమార్తె నాగలక్ష్మి బయటకు వచ్చింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిన్న కూడా ఎప్పటిలాగే టిఫిన్ వేసిన మల్లేశ్వరి రాత్రి ఇంటిలో వెళ్ళినట్లు స్థానికులు చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో అర్థం కావడం లేదని తెలిపారు. బంగారు ఆభరణాలు మాయం కావడంతో చంపి వాటిని తీసుకెళ్ళి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శరీరంపై ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఆమె పెనుగులాడినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
చాలాకాలం నుంచి ఆమెను అనుసరించిన వారే హత్య చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మల్లేశ్వరి అనుమానాస్పద మృతిని చేధించేందుకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీకెమెరా విజువల్స్ సేకరిస్తున్నారు. నిన్న నుంచి అనుమానాస్పదంగా సంచరించిన వారి వివరాలు తీసుకుంటున్నారు. శరీరంపై బంగారు చైన్, చెవి దిద్దులు, బంగారు ఉంగరాలు, పట్టీలు మాయం అయినట్లు ఆమె కుమార్తె తెలిపారు. దీంతో ఆభరణాల కోసమే హత్య చేసినట్లు అందరూ అనుకుంటున్నారు.
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్‌తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





