తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో సోమవారం చోటు చేసుకుంది.
చందుర్తి, : తాగుడుకు బానిసై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడని తండ్రిని కుమారుడు కారుతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం దేవునితండాలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జటోతు తిరుపతి (43) తాగుడుకు బానిసయ్యారు. తరచూ కుటుంబ సభ్యులతో గొడవ పడేవారు. మూడు రోజుల క్రితం ఇంట్లో ఉన్న రూ.పది వేలు తీసుకెళ్లారు. సోమవారం వచ్చి మళ్లీ డబ్బులు కావాలని భార్య అమీనాతో గొడవకు దిగారు. ఆమె ఈ విషయాన్ని తమ కుమారుడు రాజేశ్‌కు ఫోన్లో తెలిపింది. కారులో వచ్చిన రాజేశ్.. ఇంటి ముందు తల్లితో గొడవ పడుతున్న తండ్రిని కారుతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన తిరుపతిని స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. ఈ మేరకు మృతుడి అన్న రాములు నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
మరోవైపు తిరుపతిపై గతంలో చందుర్తి ఠాణాలో మూడు కేసులు ఉన్నట్లు తెలిసింది.
Also read
- నా చావుకు భార్య, అత్తామామలే కారణం
- మహాలక్ష్మీ రాజయోగం అంటే ఏమిటి? జాతకంలో ఇది ఎప్పుడు ఏర్పడుతుంది?
- Gotra meaning: గోత్రం అంటే ఏమిటి..? గోత్ర నామాల ప్రాధాన్యత తెలుసా..?
- గణపతి పూజతో సమస్త గ్రహ దోష నివారణ- బుధవారం రోజు ఆచరించాల్సిన నియమాలివే!
- పూజ చేస్తామంటూ ఇంట్లోకి వచ్చిన ముగ్గురు.. చూస్తుండగానే ఏం చేశారో తెలుసా..?





