Tuni Train Burning Case: వైసీపీ నేతలకు కష్టాలు మొదలయ్యాయా? చంద్రబాబు సర్కార్ నిర్ణయం వెనుక ఏం జరుగుతోంది? ఫ్యాన్ పార్టీ నేతలు జైలుకి వెళ్లడం ఖాయమా? సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట తుని రైలు దగ్ధం కేసును తెరపైకి తేవడానికి కారణాలేంటి? ఇవే ప్రశ్నలు ఏపీలో రాజకీయ నేతలను వెంటాడుతున్నాయి.
ఏపీలో కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సరిగ్గా తొమ్మిదేళ్ల కిందట తునిలో రత్నాచల్ ట్రైన్ ఘటన కేసు పునర్విచారణ చేయాలని నిర్ణయించింది. దీనిపై హైకోర్టుకు వెళ్లాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆదేశిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై వైసీపీలో తీవ్ర కలకలం రేపింది.
హైకోర్టు దీనికి గ్రీన్సిగ్నల్ ఇస్తే మళ్లీ విచారణ జరగడం ఖాయం. వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందని అంటున్నారు. అదే జరిగితే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేతలకు కష్టాలు తప్పవని అంటున్నారు. అంతేకాదు ఈ ఘటన వెనుక సీమకు చెందిన కొందరు నేతల ప్రమేయమున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడువారికి కష్టాలు తప్పవు.
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ 2016, జనవరి 30న తుని పరిసర ప్రాంతంలో ‘కాపు నాడు సభ’ జరిగింది. దీనికి ముద్రగడ పద్మనాభం సహా వైసీపీ కీలక నాయకులు నేతృత్వం వహించారు. ఆ సభహింసాయుతంగా మారిది. ఫలితంగా విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న రత్నాచల్ సూపర్ఫాస్ట్ రైలుని కొందరు దుండగులు తగలబెట్టారు.
ఈ ఘటనలో రైలు కాలిపోగా, ప్రయాణికులు బయటపడ్డారు. ఈ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అప్పటి చంద్రబాబు సర్కార్, ముద్రగడ సహా పలువురు వైసీపీ నేతలపై నమోదు చేసింది. ఇలాంటి ఘటన విషయంలో కఠినంగా ఉండే రైల్వే అధికారులు కేసు నమోదు చేస్తూ విచారణ చేపట్టారు. సరైన సాక్షాలు న్యాయస్థానానికి సమర్పించడంలో విఫలమయ్యారు.
ఏపీలో వైసీపీ అధికారంలోకి రాగానే ఆ కేసులపై దృష్టి పెట్టింది. 2023 మే ఒకటిన కాపు ఉద్యమ కారులపై నమోదైన కేసులను ఎత్తి వేసింది. విజయవాడలోని ఏడవ మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఈ కేసులను కొట్టివేసింది. ఆ తర్వాత రైల్వే శాఖ ముద్రగడ సహా కొందరికి సమన్లు జారీ చేసింది.
తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కేసును తెరపైకి తెచ్చింది. రైల్వే కోర్టు కేసు కొట్టి వేతపై హైకోర్టులో అప్పీలు చేయనుంది. దీంతో ఆనాటి ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా పలువురు వైసీపీ నేతలకు కష్టాలు తప్పవని అంటున్నారు.
Also read
- Telangana: అయ్యో దేవుడా.. పెళ్లైనా 6 నెలలకే ఇంత దారుణమా.. శాడిస్ట్ భర్త వేధింపులతో..
- Delhi Blast: కారు ఓనర్ పుల్వామా నివాసి.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు..
- Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్!
- ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ.Delhi blast Latest updates
- Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..





