అన్న భార్యని చంపి బిమల్ మండల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. వదిన సతి మండల్ తల నరికి తీసుకెళ్లి పోలీసుల ముందు పెట్టాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ బసంతిలోని భరత్‌గఢ్‌లో శనివారం చోటుచేసుకుంది. బిమల్ మండల్ ఆస్తి, కుటుంబ తగాదాల కారణంగానే ఆ హత్య చేశాడు.
అన్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ వ్యక్తి. వరసకు వదిన అయిన మహిళను బిమల్ మండల్ దారుణంగా హత్య చేశాడు. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో సతి మండల్ తల పట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ బసంతిలోని భరత్‌గఢ్‌లో శనివారం చోటుచేసుకుంది. బిమల్ మండల్ వదిన తల చేతిలో పట్టుకొని రోడ్డుపై వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది.
55 ఏళ్ల బిమల్ మండల్ మామిడి కాయలు కోసే కత్తితో అతని అన్న భార్య సతి మండల్ తల నరికాడు. అనంతరం ఆ తల తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. బిమల్ మండల్ అన్న కుటుంబంతో ఆస్తి, కుటుంబ తగాదాలు ఉన్నాయి. అతని అన్న 3 నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు బిమల్ మండల్ వదినని చంపేశాడు. కత్తితో ఆమె తల నరికి చేతిలో పట్టుకొని ఊరు వీధుల్లో తిరిగాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సరెండర్ అయ్యాడు.
Also read
- Papaya Benefits: ఆ సమస్యలన్నీ రాత్రికి రాత్రే మాయం.. పడుకునేముందు ఈ ఒక్క పండు తినండి
- Lucky Zodiacs: కేతువుకు బలం.. ఈ రాశుల వారికి ఆకస్మిక శుభ పరిణామాలు!
- Astrology: బుధుడు వెనక్కి వెళ్తున్నాడు.. లక్షాధికారులుగా మారే టైమ్.. ఈ 4 రాశులు లక్కీ!
- లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఐపీఎల్ క్రీడాకారుడు.. పోలీసులకు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు!
- Nagarkurnool: చూడటానికి ఇన్నోసెంట్.. చేసే పనులు ఏంటో తెలిస్తే షాక్…





