రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన అమ్ములు (3) అనే చిన్నారి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న చిన్నారి విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆడుకుంటూ వెళ్లిన మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయింది. అప్పటివరకు ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి.. కాసేపటికే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆడుకుంటూ వెళ్లి బావిలో పడి..
ముస్తాబాద్ మండల కేంద్రంలో గుడిసెలు వేసుకొని నివసిస్తున్న ఓ కుటుంబానికి చెందిన అమ్ములు (3) అనే చిన్నారి.. స్థానిక నవజ్యోతి పాఠశాల సమీపంలో ఆడుకుంటోంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. చిన్నారి బావిలో పడిన విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే బయటకు తీసేందుకు ప్రయత్నించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు సమాచారం.
చేతులారా పెంచుకున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆడుకుంటూ వెళ్లిన తమ బిడ్డ విగతజీవిగా తిరిగిరావడంతో వారి ఆవేదన స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ముస్తాబాద్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also read
- తెలంగాణ యూనివర్సిటీలో కలకలం.. జూనియర్‌పై సీనియర్ దాడి… Video
- మద్యానికి బానిసై.. డబ్బుల కోసం భార్య దారుణ హత్య
- వికారాబాద్ లొ విషాదం.. యువ మహిళా క్రికెటర్ ఆత్మహత్య
- మహాబూబాబాద్..21 పేజీల లేఖ రాసి యువతి బలవన్మరణం
- రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. లిఫ్ట్ అడిగి ఇంటికి తీసుకెళ్లిన మహిళ.. ఆపై దుస్తులు విప్పేసి!… వీడియో





