తిమ్మాజిపేట, పొలం అమ్మకం విషయంలో జరుగుతున్న గొడవల కారణంగా ఓ భార్య.. భర్త గొంతు నులిమి హత్య చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్థుల వివరాల మేరకు.. తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన అమ్మపల్లి యాదయ్య (57)కు భార్య అలివేలు, కుమార్తె పద్మ, అల్లుడు ఆంజనేయులుకు పొలం అమ్మకం విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పడుకున్న చోటే యాదయ్య మృతి చెందాడని భార్య ఇరుగుపొరుగువారితో పాటు మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయినపల్లిలో ఉండే అల్లుడు, కుమార్తెకు చెప్పింది. బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలకు సిద్ధమైన సమయంలో మృతదేహానికి స్నానం చేయిస్తుండగా శరీరంపై గాయాలున్నట్టు బంధువులు గుర్తించి అలివేలును నిలదీశారు. దీంతో తానే హత్య చేసినట్టు ఆమె ఒప్పుకొంది. హత్యలో అల్లుడు. కుమార్తెల హస్తం కూడా ఉన్నట్లు యాదయ్య అన్న కుమారుడు పోలీసులకు ఫిర్యాదుచేశారు
Also read
- కళ్లముందే కారులో మంటలు.. తండ్రి సజీవ దహనం! కుమారుడిని ఎలా కాపాడారంటే?
- నేటి జాతకములు 26 సెప్టెంబర్, 2026
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!





