అనాథ మృతదేహాన్ని తిన్న ఎలుకలు అంత్యక్రియలు చేసిన కొవిడ్ ఫైటర్స్
నెహ్రూనగర్ (గుంటూరు), : గుంటూరు రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న బసెషెల్టర్ సమీపంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం దయనీయస్థితిలో ఉన్న తీరు అందరిని కలచివేసింది. ఆ వ్యక్తి చనిపోయినా ఎవరు పట్టించుకోకపోవడంతో మృతదేహంలో కొంత భాగాన్ని అక్కడి ఎలుకలు కొరుక్కు తినేయడం గుండెల్ని పిండేసింది. స్థానికుల సమాచారంతో బుధవారం కొత్తపేట పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆర్ధిక సాయంతో గుంటూరు కౌవిడ్ ఫైటర్స్ ఛారిటబుల్ ట్రస్టు సభ్యులు గుర్తుతెలియని మృతదేహానికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు. ‘బతికున్నప్పుడు ఆ వ్యక్తికి తోడుగా ఎవరు లేకపోయినా మరణించిన తర్వాత కూడా అనాథగా మిగిలిపోకూడనే ఉద్దేశంతో చివరి వీడ్కోలు ఇచ్చాం. ప్రతి మనిషికి మరణానంతరం గౌరప్రదమైన అంత్యక్రియలు జరగాలనే మానవతా దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు’ కొవిడ్ ఫైటర్స్ పేర్కొన్నారు. కొత్తపేట పోలీసు సిబ్బంది, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, కొవిడ్ ఫైటర్స్ సభ్యులను అందరూ అభినందించారు.
Also read
- మునుకుంట్ల ప్రేమికుల మృతి ఘటనలో ట్విస్ట్..!
- గుంటూరులో నడిరోడ్డుపై.. మహిళను వివస్త్రను చేసి దాడి
- నిద్రిస్తున్న కొడుకు తలపై కర్రతో కొట్టి హతమార్చిన తండ్రి
- 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. సీసీటీవీ చూసి ఆగ్రహించిన స్థానికుల దాడి, అనుమానితుడు మృతి
- టీ తాగేందుకు రూ.20 ఇవ్వలేదని తలా మొండెం వేరు చేశాడు!





