నందిగామ: చిన్నారులపై ప్రేమను చూపించాల్సిన తల్లి.. ప్రియుడి మోజులో పడి కర్కశంగా మారింది. పిల్లల శరీరంపై ఇష్టారీతిన వాతలు పెట్టి అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది. చిన్నారుల రోదనలు విన్న చుట్టుపక్కల వారు వెళ్లి చూసి.. కోపోద్రిక్తులై తల్లికి, ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామలో మంగళవారం వెలుగుచూసింది. స్థానికుల వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన పింకీదేవి, సుజీత్ దంపతులకు కుమార్తెలు నందిని(12), ప్రియాంక(6), కుమారుడు ఆదిత్య(1) ఉన్నారు. మూడేళ్ల క్రితం నందిగామకు వలస వచ్చి స్థానికంగా ఓ పరిశ్రమలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బిహార్‌కు చెందిన చిందుకుమార్ పింకీకి పరిచయం ఏర్పడి చనువుగా ఉండేది.
పలుమార్లు హెచ్చరించినా భార్య పద్ధతి మార్చుకోకపోవడంతో భర్త సుజీత్ మూడు నెలల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. దీంతో ప్రియుడితో కలిసి సహజీవనం మొదలు పెట్టిన పింకీ.. పిల్లలు ఆదిత్య, ప్రియాంకలను చిత్రహింసలకు గురిచేసేది. రోజూ చిన్నారుల రోదనలు వింటున్న కాలనీవాసులు మంగళవారం ఇంట్లోకి వెళ్లి చూడగా ఒంటినిండా కాలిన గాయాలతో రోదిస్తున్న చిన్నారులను చూసి చలించిపోయారు. ఆగ్రహంతో పింకీతోపాటు ఆమె ప్రియుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారులను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పెద్దకుమార్తె నందినికి ఎలాంటి గాయాలు లేకపోవడంపై పోలీసులు ప్రశ్నించగా.. వంట చేసే క్రమంలో తమ్ముడు, చెల్లిపై నూనె పడిందని చెప్పడం గమనార్హం. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




