పహాడీషరీఫ్, మత్తు ఇంజెక్షన్ తీసుకున్న ఓ వైద్యుడు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా బాలాపూర్ రాణా పరిదిలో చోటుచేసుకుంది. ఇన్ స్పెక్టర్ ఎం.సుధాకర్ కథనం ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన మొహ్మద్ ఇమాయతుల్లా కుమారుడు వాసిం(27) పాతబస్తీలోని యాకుత్ పురలో నివాసముంటున్నారు.. చార్మినార్ వద్ద ఉన్న నిజామియా యునానీ కళాశాలలో చదివారు. రెండు నెలలుగా మల్లాపూర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాత్రి విధుల్లో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి విశ్రాంతికని ఆసుపత్రిలోని తన గదిలోకెళ్లి గడియ పెట్టుకున్నారు. తర్వాత వైద్యుడు ఎంత సేపటికీ బయటకు రావడం లేదని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. తలుపులు కొట్టినా తీయకపోవడంతో విరగ్గొట్టారు. అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే తనకు నిద్ర పట్టడం లేదని ఖాసిం చెప్పేవారని ఆయన తండ్రి పోలీసులకు తెలిపారు. నిద్ర కోసం మాత్రలతో పాటు మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఖాసిం మృతి చెందిన విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం తమకు వెంటనే తెలియజేయలేదంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
Also read
- ‘చనిపోయిన 7 నిమిషాల తర్వాత కూడా మెదడు పనిచేస్తుందట.. అప్పుడూ నీ గురించే ఆలోచిస్తా..!’
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’




