పిఠాపురం: ఫ్రిజ్ వాటర్ అడిగితే.. తొందరగా తేలేదని కసాయి కొడుకు విచక్షణారహితంగా దాడి చేయడంతో అతని కన్నతల్లి చికిత్సపొందుతూ కన్నుమూసిన అమానవీయ ఘటన కాకినాడ జిల్లాలో గగుర్పాటుకు గురిచేసింది. పిఠాపురం మండలం చిత్రాడలో ఈ దారుణం జరిగింది. పోలీసులు కథనం ప్రకారం.. స్థానిక ఈబీసీ కాలనీకి చెందిన పెంటా నాగమణి (45) తన కుమారుడు రాజబాబుకు ఈ నెల 9న మధ్యాహ్నం భోజనం వడ్డించింది. తింటున్న అతడు ఫ్రీజ్లోని మంచినీళ్లు తెమ్మన్నాడు. కాస్త ఆలస్యం కావడంతో కోపోద్రిక్తుడైన రాజబాబు అరుస్తూ ప్రిజ్ దగ్గరకు వెళ్తూ గుమ్మానికి ఢీకొని గాయపడ్డాడు. విచక్షణ కోల్పోయిన అతడు అదే సమయంలో మంచినీళ్లిచ్చిన తల్లి తలను పూజ గదిలోని చెక్క బల్లకేసి కొట్టాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె నేలపై పడిపోయింది. ఇంతలో ఇంటికొచ్చిన ఆమె భర్త త్రిమూర్తులు, బంధువులు 108కి ఫోన్ చేసి అంబులెన్స్లో కాకినాడలోని ప్రభుత్వాసుపత్రి (జీజీహెద్)కి తీసుకువెళ్లారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న నాగమణి ఆరోగ్యం విషమించడంతో ఆదివారం ఉదయం మృతిచెందింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై లోకేశ్ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు
Also read
- చిత్తూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
- ఫ్రిజ్ వాటర్ వెంటనే తేలేదని.. కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు
- అర్ధరాత్రి ఆలయ ప్రాంగణం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు.. ఫిర్యాదులో పోలీసులు వెళ్లి చూడగా
- బడంగ్ పేట్లో పేలుడు.. వ్యక్తి మృతి
- నరసాపురంలో మహిళ దారుణహత్య





