ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషనఘన్పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో చోటుచేసుకొంది.
స్టేషన్ ఘన్పూర్ , : ప్రభుత్వ పథకాల విషయంలో వివాదం తలెత్తి కన్నతల్లిని కుమారుడు ఇనుప పైపుతో కొట్టి హతమార్చిన దారుణ సంఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండ గ్రామంలో చోటుచేసుకొంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సముద్రాల లచ్చమ్మ(65) చిన్న కుమారుడు సముద్రాల సత్తయ్య కాజీపేటలో అద్దె నివాసంలో ఉంటున్నాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ఉచిత పథకాలను రేషన్‌కార్డు సాయంతో పొందుతున్నాడు. ఉమ్మడిగా ఉన్న రేషన్‌కార్డు తీసుకెళ్లి నువ్వు ఒక్కడివే పథకాలు ఎలా పొందుతావని శుక్రవారం అర్ధరాత్రి తల్లి ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో గతంలోనూ తనకు రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో భూమిని విక్రయించగా వచ్చిన డబ్బులు సరిగా ఇవ్వలేదని క్షణికావేశానికి లోనైన సత్తయ్య తల్లిని ఇనుప పైపుతో కొట్టడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్‌టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





