హైదరాబాద్: కుటుంబ కలహాలతో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు భర్త. ఈ ఘటన బహదూర్‌పురా పోలీస్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌బాగ్‌కు చెందిన సులేమాన్ బిన్, నిషాత్ ఫాతిమా (28) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సులేమాన్ భార్యతో నిత్యం గొడవపడేవాడు. ఈ క్రమంలోనే అతడు రెండో వివాహం చేసుకున్నాడు.
మొదటి భార్యతో గొడవ పడుతుండడంతో గతంలో మహిళా పోలీస్టేషన్లో కేసు నమోదయ్యింది. పెద్దలు సర్దిచెప్పడంతో బాగా చూసుకుంటానని చెప్పిన సులేమాన్ మళ్లీ గొడవ పడుతుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం కిషన్ బాగ్ లోని ఇంటికి కత్తితో వచ్చిన సులేమాన్, పిల్లలను వేరే గదిలో ఉంచి, భార్య నిషాత్ ఫాతిమా గొంతుకోసి బయటి నుంచి గడియపెట్టి పారిపోయాడు. నిషాత్ పాతిమా తల్లి సాయంత్రం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఇంటికి వచ్చి చూడగా కూతురు విగత జీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న బహదూర్ పురా పోలీసులు ఆధారాలను సేకరించారు. ఘటనా స్థలాన్ని ఫలక్‌నుమా ఏసీపీ జావెద్ పరిశీలించారు. నిషాత్ ఫాతిమా తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- భార్య గొంతు కోసి చంపేశాడు
- అమ్మాయికి పెళ్లి సంబంధం చూసి వస్తున్నారు.. ఇంతలోనే, ఊహించని ఘటన..
- సెల్‌ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య
- వారం క్రితం మిస్సైన బీటెక్ విద్యార్థి మృతి.. బాడీ ఎక్కడ దొరికిందంటే?
- ఊళ్ళో దెయ్యాలు – భూతాలను తరిమేస్తామంటూ వచ్చారు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!





