చిత్తూరు: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన
చోటుకేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి ఆత్మహత్యకు అనారోగ్య సమస్యలు, ఆర్థిక పరిస్థితులే కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే, పిల్లలతో సహా అందరూ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా బంగారెడ్డి పల్లె గ్రామానికి దాము, నిర్మల ఇద్దరూ భార్యభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు, అయితే, నిర్మలకు అనార్యోగ సమస్యలు ఉన్నాయి. దీంతో, ఆర్థిక సమస్యలు ఎక్కువైనట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే భర్త దాము, భార్య నిర్మల ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.
Also read
- అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లి వెంటే వచ్చి.. అదే బస్సు కిందపడి మూడేళ్ల బాలుడు మృతి!
- వేడి సాంబార్లో పడి మహిళ మృతి.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





