నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో దారుణం చోటుచేసుకుంది. మహిళను ఓ వ్యక్తి కత్తితో నరికి చంపాడు. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. టీనా రోజా స్వస్థలం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి. సూళ్లూరుపేటలో ఆమె ఏఎన్ఎం శిక్షణకు వెళ్లి తిరిగి వచ్చింది. నరసాపురం రైల్వేస్టేషన్లో దిగి కారులో ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గాని రమేశ్ అనే వ్యక్తి దాడి చేశాడు. వాటర్ బాటిల్ కోసం ఓ షాపు దగ్గర యువతి కారు ఆపగా.. రమేశ్ విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు యత్నించిన కారు డ్రైవర్ సురేశ్పైనా రమేశ్ కత్తితో దాడికి పాల్పడ్డాడు. అతడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- చిత్తూరులో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
- ఫ్రిజ్ వాటర్ వెంటనే తేలేదని.. కన్నతల్లిని కడతేర్చిన కసాయి కొడుకు
- అర్ధరాత్రి ఆలయ ప్రాంగణం నుంచి పెద్ద పెద్ద శబ్దాలు.. ఫిర్యాదులో పోలీసులు వెళ్లి చూడగా
- బడంగ్ పేట్లో పేలుడు.. వ్యక్తి మృతి
- నరసాపురంలో మహిళ దారుణహత్య





