కామారెడ్డి జిల్లా పిట్లం మండలంచిన్న కొడప్‌గల్ శివారులో దారుణం చోటు చేసుకుంది. రెడ్డి చెరువులో గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ (37) మృతదేహం లభ్యమైంది. ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.
Crime News: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని చిన్న కొడప్ గల్ శివారులో ఉన్న రెడ్డి చెరువులో శనివారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ (37) మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. కృష్ణ తలపై తీవ్ర గాయాలు కనిపించడంతో ఇది సహజ మరణం కాదని.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేసి చెరువులో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
చెరువులో పంచాయతీ కార్యదర్శి మృతదేహం..
కృష్ణ, పోతిరెడ్డిపల్లె పరిధిలోని జగదాంబ తండాకు చెందిన వ్యక్తి. అతను గత రెండు రోజులుగా అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉండగా.. చివరికి రెడ్డి చెరువులో మృతదేహం కనిపించడంతో వారి ఆశలు నెరవేరకుండా పోయాయి. శవాన్ని పరిశీలించిన పోలీసులకు తలపై బలంగా కొట్టిన గాయాలు స్పష్టంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఇది ఒక పక్కా హత్యగా భావిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది
ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్న అంశాల్లో అక్రమ సంబంధం కోణం కూడా ఒకటి. వ్యక్తిగత ద్వేషం, పాత కక్షలు, లేదా మరేదైనా వ్యక్తిగత కారణం కావచ్చన్న కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. సంఘటన వెలుగులోకి రావడంతో డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రకారం.. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదిగా తెలిపారు. గ్రామస్తులు, బంధువులు కృష్ణ హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ న్యాయం జరగాలని కోరుతున్నారు. ఈ సంఘటనతో పిట్లం మండలంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Also read
- Venni Karumbeswarar Temple: షుగర్ పేషెంట్లు క్యూ కడుతోన్న శివాలయం.. ఈ ఆలయ రహస్యం ఇదే!
- 2026లో అదృష్ట రాశులు వీరే.. మీ రాశి ఉందో చూసేయండి!
నవ గ్రహాల్లో శని గ్రహానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతనే వేరు. - Garuda Puranam: గరుడ పురాణం ప్రకారం ఈ సంకేతాలు కనిపిస్తే మరణం ఆసన్నం అయినట్లట
- Kubera Yoga: గురువు అతి వక్రం.. ఆ రాశుల వారికి కుబేర యోగం పట్టబోతోంది..!
- Nidhivan Mystery: రాత్రి పూట ఆ గుడివైపు వెళ్లిన వారు ఏమవుతున్నారు?.. రంగమహల్ మిస్టరీ ఇదీ!





