విశాఖపట్నం (మాధవధార): విశాఖపట్నంలోని అశోక పార్క్ నేవీ క్యాంటీన్ వద్ద విధి నిర్వహణలో ఉన్న సెక్యూరిటీ ఉద్యోగి గన్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎయిర్పోర్టు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మోరే పరాగ్ సురేష్ రావు(43) నేవీ క్యాంటీన్ వద్ద డీఎస్ సీ (డిఫెన్స్ సెక్యూరిటీ కోర్)గా విధులు నిర్వహిస్తున్నారు. సమీపంలో ఉన్న క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి నేవీ క్యాంటీన్ సమీపంలోని వెడ్ విభాగంలో టవర్-1లో సెంట్రీ విధులకు హాజరయ్యారు.
శనివారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న గన్ తో కాల్చుకున్నారు.
కాల్పుల శబ్దం వినిపించడంతో అప్రమత్తమైన సహచర సిబ్బంది అక్కడ వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందారు. నేవీ ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అందుకున్న ఎయిర్పోర్టు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన మృతికి ఎవరూ కారణం కాదని సురేష్ రాసిన లెటర్ను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. కమాండర్ సుర్జీత్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





