హైదరాబాద్: ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.26.57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ సాయి మనోహర్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఆన్ లైన్ ట్రేడింగ్ ద్వారా అదనపు లాభాలు వస్తాయంటూ సురేష్రెడ్డి అనే వ్యక్తికి సైబర్ కేటుగాళ్లు వల వేశారు. వారి మాటలు నమ్మిన ఆయన మొదటగా రూ.21.61 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఆ సొమ్ముకు 10 శాతం అదనపు లాభం వచ్చినట్లు నిందితులు నకిలీ రికార్డులతో నమ్మించారు.
దీంతో మరింత లాభం కోసం ఆయన మరో రూ.21.90 లక్షలు చెల్లించారు. ఆ తర్వాత రూ.2 కోట్ల లాభం వచ్చిందని నమ్మించి.. ఆ సొమ్ము విత్ డ్రా నిబంధనల పేరిట నిందితులు ఆయన వద్ద నుంచి విడతల వారీగా రూ.46 లక్షలు, రూ.10 లక్షలు, రూ.4.60 లక్షలు జమ చేయించుకున్నారు. ఎంతకూ డబ్బు కట్టినా ఫలితం లేకపోవడం, నిందితుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని ఆయన గ్రహించారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు జరిపిన పోలీసులు.. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





