హైదరాబాద్: మాదన్నపేట బాలిక మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. అమ్మమ్మ ఇంటికి వెళ్ళిన బాలిక కనిపించకుండా పోయింది.. చివరికి ఇంటిమీద నీళ్ల ట్యాంక్ లో విగత జీవిగా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల మేరకు.. ఒవైసీ కంచన్ బాగ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలిక నిన్న తల్లితో పాటు మాదన్నపేటలో నివసించే అమ్మమ్మ ఇంటికి వచ్చింది. నిన్న సాయంత్రం నుండి ఇంట్లో నుండి బయటకి వచ్చి కనిపించకుండా పోయింది. దీంతో అప్రమత్తంమైన బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహం నీళ్ల ట్యాంక్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదవశాత్తూ బాలిక నీళ్ల ట్యాంకులో పడిపోయిందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి అందులో పడేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- Hyderabad: ఇంట్లో గడియ పెట్టుకుని బయటకు రాని లేడీ డాక్టర్.. తొంగి చూసి అంతా షాక్!
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





