తోటి కానిస్టేబుల్ లైంగిక వేధింపులే కారణమని సూసైడ్ నోట్
వరంగల్ జిల్లా మట్టెవాడ : తోటి కానిస్టేబుల్ లైంగిక వేధింపులు తట్టుకోలేక ఒక మహిళా పోలీసు ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్లో లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్లోని మట్టెవాడకు చెందిన నాగరాజుతో భూపాలపల్లి జిల్లా గోరుకొత్తపల్లికి చెందిన సాదు సంగీత (33)కు పదేళ్ల కిందట వివాహమైంది. 2024లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన సంగీత ములుగు ఘన్పూర్ ఠాణాలో పనిచేస్తుండగా.. శ్రీధర్ అనే కానిస్టేబుల్ పరిచయమయ్యాడు. అతడు సంగీతను వేధించడంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఉన్నతాధికారులు సర్దిచెప్పినా.. ఫలితం లేకపోవడంతో 5 నెలల కిందట సంగీతను భూపాలపల్లికి బదిలీ చేశారు. శ్రీధరన్ను ఏఆర్కు అటాచ్ చేశారు. అయినా అతడి వేధింపులు తీవ్రం కావడంతో సంగీత ఆందోళనకు గురయ్యారు. సోమవారం సీఎం పర్యటనలో విధులు నిర్వహించిన ఆమె వరంగల్కు వచ్చారు. మంగళవారం ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతురాలికి కుమారుడు ఉన్నాడు. శ్రీధర్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంగీత రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
Also read
- Garuda Purana: మరణం తర్వాత మృతదేహాన్ని మంచం నుంచి తీసి నేలపై ఎందుకు ఉంచుతారు?
- Weekly Horoscope: ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో వారికి శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు ఇలా..
- అప్పటి వరకు అంత బాగానే సాగింది.. అది స్టార్ట్ చేశాకే అసలు సమస్య మొదలైంది! చివరకు
- ప్రియుడికి సర్ప్రైజ్ ఇచ్చి.. ఆపై కటకటాల్లోకి!
- అప్పుల బాధ తాళలేక.. గోదావరిలోకి దూకిన కుటుంబం





