కాకినాడ : కాకినాడలోని ఈవీఎం గోదాము వద్ద విధుల్లో ఉండగా తుపాకీ మిస్‌ఫైర్ అయి హెడ్‌కానిస్టేబుల్ లంకే ధనరాజు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆయనను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. సోమవారం ఉదయం జరిగిన ఘటనపై కాకినాడ మూడో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాకినాడలోని జగన్నాథపురానికి చెందిన ధనరాజు హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ప్రసుత్తం వీఆర్ లో ఉన్నారు. ఆయన ఇటీవల అల్లూరి జిల్లా నుంచి బదిలీపై కాకినాడ జిల్లాకు వచ్చారు. మరలా తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ జరుగుతుండగానే విధుల్లో తుపాకీ పేలి గాయాలతో ఆసుపత్రి పాలవడం చర్చనీయాంశమవుతోంది. బదిలీ భయంతో పాటు కుటుంబ సంబంధిత సమస్యలతో అతనే కాల్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వాదనలను పోలీసులు కొట్టిపారేశారు. తుపాకీని శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ కావడం వల్లే గాయాలపాలయ్యారని చెబుతున్నారు.
Also read
- కుమారుడి కళ్లెదుటే కిరాతకం.. భార్యను హత్య చేసిన భర్త
- ఇన్వర్టర్ నుంచి విద్యుత్తు సరఫరా..స్తంభంపైనే ప్రాణాలొదిలిన కార్మికుడు
- మృగశిర కార్తె అయితే.. చేపలు కొనుక్కోవాలి.. లూటీ చేయకూడదు.. చెరువు మీద పడి నిమిషాల్లోనే..
- పోలీసులను చూసి వెనక్కి తిరిగిన కుర్రోళ్లు.. ఛేజ్ చేసి పట్టుకుంటే.. పెద్ద ప్లానే..
- తిక్క కుదిరింది.. ట్రాఫిక్ డీసీపీపై సోషల్ మీడియాలో పిచ్చి కామెంట్లు! వారిపై కేసు నమోదు





