ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య: పైళ్లెన పది నెలలకే అత్తింటి వేధింపులు భరించలేక నాలుగు నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన తంబళ్లపల్లె మండలంలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లి దండ్రులు తంబళ్లపల్లె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు… కోటకొండ పంచాయతీ, బీఎస్ఆర్ వడ్డిపల్లికి చెందిన మహేష్, రవళి (18)ని 10 నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. పైళ్లెన మూడు నెలల నుంచే అత్త అరుణ వేధింపులు ప్రారంభించింది. దీంతో రవళి తీవ్ర మనోవేదనకు గురైంది.
రవళి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి. అయినప్పటికీ అత్త అరుణ వేధింపులకు గురిచేసేది. వేధింపులు భరించలేక రవళి ఈనెల 15 ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించగా, డాక్టర్లు చికిత్సలు అందించి పరిస్థితి విషమించడంతో రుయాకు రెఫర్ చేశారు. అక్కడి నుంచి బెంగళూరుకు తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం రాత్రి స్వగ్రామానికి తీసుకు వచ్చారు. బుధవారం ఉదయం నాలుగు నెలల గర్భిణి రవళి మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె ఎస్ఐ అనీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- ముఖ్యమంత్రి చంద్రబాబు జలవిజన్ కు ఎన్నో ప్రశంసలు
- చాక్లెట్ ఆశచూపి బాలుడి కిడ్నాప్
- రేపే వివాహం.. ఇంతలోనే కాల్వలో గల్లంతు
- అమానుషం.. అర్ధరాత్రి కదులుతున్న ఆటో నుంచి రోడ్డుపై ఏదో విసిరేశారు! దగ్గరకెళ్లి చూడగా..
- ఇన్‌స్టాలో పరిచమయ్యాడు.. తర్వాత ఇంటి నుంచి తీసుకెళ్లాడు.. కట్‌చేస్తే.. 3 నెలల తర్వాత..





