కాసిపేట: పెద్దల తప్పు నలుగురు చిన్నారులను అనాథలుగా చేసిన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కాసిపేట మండలం దేవాపూర్ ఎస్ఐ గంగారాం వివరాల ప్రకారం.. మందమర్రి మండలం బురదగూడెనికి చెందిన లక్ష్మి(40), లింగయ్య దంపతులకు నలుగురు సంతానం. రెండేళ్ల క్రితం లింగయ్య భార్య, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ పిల్లలతో జీవనం సాగించింది. ఈ క్రమంలోనే కాసిపేట మండలంలోని మల్కపల్లికి చెందిన సంతోష్ ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో ఆరు నెలల క్రితం పిల్లలను వదిలేసి.. మల్కపల్లిలో సంతోష్ సహజీవనం సాగిస్తోంది. అయితే.. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో సంతోష్ ఆమె పై దాడి చేసి హతమార్చాడు.
రోడ్డు ప్రమాదానికి గురైందని 108 అంబులెన్స్కు సమాచారం అందించి కాసిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. శరీరంపై గాయాలు గమనించిన వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐఐ గంగారాం ఆసుపత్రికి చేరుకొని దర్యాప్త చేపట్టారు. మృతదేహంపై గాయాల ఆధారంగా హత్య చేసి ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. సంతోష్పా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంతోష్ మొదటి భార్య గతంలోనే వదిలేసి వెళ్లిపోయింది. తర్వాత మరో మహిళతో సహజీవనం చేశాడు. ఆమె కూడా అనుమానాస్పద స్థితిలోనే మృతి చెందింది. మరోవైపు.. తండ్రి వదిలేసి వెళ్లిపోవడం.. లక్ష్మి మృతితో నలుగురు పిల్లలు అనాథలుగా మారిపోయారు.
Also read
- నెయ్యి గోదాములో భారీ అగ్ని ప్రమాదం
- సహజీవనం తీసింది ప్రాణం.. అనాథలైన నలుగురు పిల్లలు
- కుమారుడి కళ్లెదుటే కిరాతకం.. భార్యను హత్య చేసిన భర్త
- ఇన్వర్టర్ నుంచి విద్యుత్తు సరఫరా..స్తంభంపైనే ప్రాణాలొదిలిన కార్మికుడు
- మృగశిర కార్తె అయితే.. చేపలు కొనుక్కోవాలి.. లూటీ చేయకూడదు.. చెరువు మీద పడి నిమిషాల్లోనే..





