తాడిపత్రి: అనంతపురం జిల్లాలో ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. తాడిపత్రిలోని గన్నవారిపల్లె కాలనీలోని నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని లక్ష్మీప్రసన్న(30) బలవన్మనరణానికి పాల్పడింది. తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్న ఆమెకు.. గత నెలలో కర్ణాటకలోని కోలార్ జిల్లా నివాసి విజయ్ కుమార్ తో వివాహం జరిగింది. పెళ్లికి ముందే ఒకసారి ఆమె డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించగా.. తల్లిదండ్రులు రక్షించారు. గురువారం అత్తగారింటికి వెళ్లాల్సి ఉండగా.. ఆమె ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- నేటి జాతకములు 21 జూన్, 2026
- Lotus Flower: దేవతల ఆసనంగా తామర పువ్వే ఎందుకు? సనాతన ధర్మం చెప్పే ఆశ్చర్యకర రహస్యం
- గరుడ పురాణం: ఈ 7 మహాపాపాలు చేస్తే నరకంలో దారుణమైన శిక్షలు తప్పవు
- తెలంగాణ టు కర్ణాటక.. అర్థరాత్రి ఇదేం పనిరా..? పోలీసులు ఛేజ్ చేస్తుంటే.. వాళ్లు ఏం చేశారంటే
- Tenali: సుడి మారాలని గోల్డ్ షాపును కొల్లగొట్టిన దొంగలు.. లోపల వారికి దొరికింది ఏంటో తెలుసా..?





