తెలంగాణాలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలోమల్లన్న జాతరలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర ప్రకంపనలు రేపింది. మరోవైపు కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కుల వివక్షకు సంబంధించిన మరో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక దళిత కుటుంబాన్ని అవమానించి, ఆలయం నుండి బహిష్కరించిన ఘటన ఘర్షణకు దారి తీసింది. ఈఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం గోని గ్రామంలోని అరసమ్మ ఆలయంలో ఈ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లైన దళిత జంట ప్రార్థనలు చేయడానికి ఆలయానికి వచ్చినప్పుడు నారాయణప్ప అనే వ్యక్తి అడ్డుకున్నాడు. ఆధిపత్య కులానికి చెందిన నారాయణప్ప, ఎలాగైనా వారిని ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు నానాయాగీ చేశాడు. తనకు దేవత సోకిందంటూ నాటకం ఆడాడు. మెకాళ్లపై అమ్మవారికి అడ్డంగా కూర్చొని, వారిని దర్శనం చేసుకోనీయకుండా అడ్డుపడటం ఫుటేజ్‌లో ఉంది. ఆ తర్వాత అతను లేచి నిలబడి వెంటనే వెళ్లి పోవాలంటూ గట్టిగా అరుస్తూ ఊగిపోయాడు.
దీంతో ఆవేదనకు గురైన వరుడు జగదీష్ న్యాయం కోసం అధికారులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు ఆధారంగా, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం కింద తురువేకెరె పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఎస్పీ కేవీ అశోక్ తురువేకెరె పోలీస్ స్టేషన్లో తమకు అందిన ఫిర్యాదు మేరకు ఒకర్ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
Also read
- ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ.. కట్ చేస్తే..
- అర్థరాత్రి ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్ధాలు.. అనుమానం వచ్చి ఉదయం వెళ్లి చూడగా.. వామ్మో
- ఒంటికి నిప్పంటించుకుని రోడ్డుపైకి..
- ‘నా చావుకు కారణం వెంకటేశ్..’
- కన్న కొడుకును కత్తెరతో పొడిచి చంపిన తల్లి.. ఎందుకో తెలుసా..?





