రంగారెడ్డి: మరో దారుణం చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని మంచాల మండలం నోములలో జరిగింది. భార్య నిద్రిస్తున్న సమయంలో భర్త ఈ ఘాతకానికి పాల్పడ్డాడు.
వివరాల్లోకి వెళితే.. అమృత, బాబులు.. భార్యా భర్తలు. అయితే మద్యానికి బానిసైన భర్త బాబు.. పదే పదే భార్య అమృతను వేధింపులకు గురి చేస్తున్నాడు. తాగొచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తరుచు గొడవలు జరుగుతూ ఉండేవి. కాగా, అమృత నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో నరికి హత్య చేశాడు. భార్యను హత్య చేసిన అనంతరం భర్త బాబు పరారయ్యాడు. ప్రస్తుతం నిందితుడు బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
Also read
- Blue Moon: రేపు అరుదైన బ్లూ మూన్ దర్శనం.. ఈ సమయంలోనే, తప్పక చేయాల్సిన పరిహారాలు ఇవే!
- జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఈ ఒక్క పని చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ధనం వెల్లువలా వస్తుందట!
- ఆది వారం రోజే జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంటే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- తడకల మాటున చాటుమాటు యవ్వారం.. తొంగిచూసిన స్థానికుల మైండ్ బ్లాక్!





