తోడబుట్టిన చెల్లెలే కదా అని ఆదరించింది. ఆమె కొడుకును కన్నకొడుకు కంటే మిన్నగా చూసుకుంది. కట్ చేస్తే ఇద్దరూ కలిసి ఆమె ప్రాణమే తీసేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఫిబ్రవరి 19న స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీస్‌లో ఫస్ట్ డివిజన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జయలక్ష్మి (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తొలుత అందరూ ఆమెది సహజ మరణమే అనుకున్నారు. కానీ జయలక్ష్మి లివ్-ఇన్ భాగస్వామి శ్రీనివాస్ అనుమానాలు వ్యక్తం చేస్తూ చిక్కనాయకనహళ్లి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో అసలు విషయం తెలిసింది.
జయలక్ష్మి సోదరి, ఆమె కొడుకే హత్య చేశారని చిక్కనాయకనహళ్లి పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఊపిరి ఆడకుండా చేయడం వల్లే ఆమె చనిపోయిందని పోస్ట్ మార్టం నివేదిక కూడా స్పష్టం చేసింది. ఈ కేసులో సోదరి అనసూయ, ఆమె కుమారుడు చంద్రశేఖరను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫిబ్రవరి 19న జయలక్ష్మి మృతి చెందగా, ఒక రోజు తర్వాత ఆమె అంత్యక్రియలకు సన్నాహాలు చేస్తుండగా అసలు విషయం తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసులు సమాచారం ప్రకారం జయలక్ష్మి భర్త, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, 19 సంవత్సరాల క్రితం మరణించాడు. భర్త చనిపోయాక ఆమె శ్రీనివాస్ అనే వ్యక్తితో ໖໓-໑໓ రిలేషన్‌షిప్‌లోకి ప్రవేశించింది. అటు జయలక్ష్మి సోదరి అనసూయ తన భర్తతో విభేదాలతో విడిగా ఉంటోంది. దీంతో జాలి తలచి అధికారికంగా చంద్రశేఖర్‌ను దత్తత తీసుకున్నట్టు రికార్డులు లేనప్పటికీ సొంత కొడుకు కంటే మిన్నగా ఆదరించింది. చదువుకు అన్ని విధాలా సాయపడింది. అయితే ఇటీవల అనసూయ, కొడుకు జయలక్ష్మి, శ్రీనివాస్ ఉంటున్న ఇంటికి మకాం మార్చారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. చివరికి జయలక్ష్మి, శ్రీనివాస్ కొత్త లీజుకు తీసుకున్న నివాసానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో జయలక్ష్మి నుంచి రావాల్సిన సాయం అందదని, ఆమె ఆస్తులన్నింటినీ తన భాగస్వామికి బదిలీ చేస్తుందని భయపడి, తల్లీకొడుకు హత్యకు కుట్ర పన్నారు. ఆమె మరణం తర్వాత వారు కారుణ్య ప్రాతిపదికన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలని కూడా ప్లాన్ చేశారట.
Also read
- Ongole: ఒంగోలులో మిస్టరీగా మారిన యువతి మరణం.. ఇంతకీ అతను ఎక్కడికి వెళ్లినట్లు..?
- దుర్గా నిమజ్జనం రాత్రిపూట ఎందుకు చేయకూడదు? సరైన సమయం, ముఖ్యమైన నియమాలు ఇవే!
- నవదుర్గలలో ఈరోజు 5వ రోజు – స్కందమాత, ఐదవ నవదుర్గ…!!*_
- దుర్గాపూజ ఐదు రోజుల విశిష్టత ఇదే.. షష్ఠి నుంచి విజయదశమి వరకు అమ్మవారి ఆరాధన వెనుక ఆధ్యాత్మిక రహస్యం!
- దుర్గాదేవి చేతిలోని 8 ఆయుధాలు మనకు చెప్పే 8 జీవిత పాఠాలు ఏమిటో తెలుసా!





