ప్రమాదానికి ముందు వినియోగంలో ఉన్న ఫోన్ పేలిపోవటం పట్ల ఫోన్ యజమాని, షాప్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాడైపోయిన మొబైల్ఫోన్ని రిపేర్ చేస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కోజికోడ్ జిల్లా ముక్కాట్లో మంగళవారం సాయంత్రం జరిగింది. చలీల్ అనే వ్యక్తి మొబైల్ రిపేరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు ఓ వ్యక్తి ఫోన్ను రిపేర్ కోసం తీసుకొచ్చాడు. ఆ ఫోన్ను షాపులోని ఉద్యోగి రిపేర్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది. మంటలు చెలరేగగా, ఉద్యోగికి తృటిలో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రమాదానికి ముందు వినియోగంలో ఉన్న ఫోన్ పేలిపోవటం పట్ల ఫోన్ యజమాని, షాప్ సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని షోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
మొబైల్ మెకానిక్ చెప్పిన వివరాల ప్రకారం బ్యాటరీలు పాడైపోయిన మొబైల్ ఫోన్లను ఉపయోగించడం వల్ల ఇలాంటి పెద్ద ప్రమాదాలు సంభవిస్తాయని చెప్పారు
Also read
- Dhanteras: ధంతేరస్ రోజున 4 శుభయోగాలు.. ఈ 4 రాశులకు ధనలాభం, అదృష్టం! మీ రాశి ఉందా?
- Diwali: దీపావళి రోజున మీ రాశి ప్రకారం ఈ పని చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట!
- Dhanteras: బంగారం, వెండి కొనాల్సిన పనిలేదు.. ధంతేరస్ రోజున ఈ 5 లక్కీ ప్లాంట్స్ ఇంటికి తెచ్చుకోండి!
- 5 Days of Diwali: దీపావళి ఐదు రోజులు ఎందుకు జరుపుకుంటారు? ధనత్రయోదశి నుంచి భాయ్ దూజ్ వరకు విశేషాలివే!
- రేపే ధన త్రయోదశి.. తప్పక కొనాల్సిన నాలుగు వస్తువులు ఇవే





