సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్
సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సోమవారం ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ డిబేట్‌లో ఆమె మాట్లాడుతూ.. తన తండ్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ సతీమణి భారతి పాత్రపై విచారణ జరగాల్సిందేనని అన్నారు. వివేకా హత్య గురించి సీఎం జగన్, భారతి, అవినాష్ రెడ్డికి ఉదయం 5.30 గంటలకే తెలుసని.. అందరికంటే ముందే వాళ్లకు అసలు ఆ విషయం ఎలా తెలుసని సీబీఐ వారిని ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వివేకా మర్డర్ జరిగిన రోజు వాళ్ల ఫోన్ కాల్స్‌పైనా దర్యాప్తు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.
జగన్, భారతి, అవినాష్ రెడ్డిపై వివేకా హత్య కేసు కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటుందన్నారు. రాష్ట్రంలో జగన్ ఐదేళ్లు అధికారంలో ఉన్నాడని, జగన్ మళ్లీ సీఎం అయిన నా పోరాటం కొనసాగిస్తానని ఆమె తేల్చిచెప్పారు. ఇప్పుడు కూడా జగన్ నుండి తమకు ప్రాణహాని ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తాను అందరిని కలుస్తున్నానని, ప్రచారంలో చాలా మంది తనకు అండగా నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం మీద భయంతో వాళ్లు మాట్లాడలేకపోతున్నారని అన్నారు.
Also read
- AP Crime: భార్యభర్త.. మధ్యలో ఓ ట్రాన్స్ జెండర్.. ఆ పని చేయొద్దన్నందుకు నరికేశాడు!
- Andhra News: మాజీ ఎమ్మెల్యే భర్త, వైసీపీ నేత హత్య కేసులో సంచలన తీర్పు.. 11 మందికి యావజ్జీవ కారాగారశిక్ష
- తీరు మార్చుకోని లేడీ పోలీస్ ఆఫీసర్ స్వర్ణలత.. మరో కేసులోనూ హస్తం.. సబ్ రిజిస్ట్రార్‌ను బెదిరించి..
- ప్రియుడితో వెళ్లిపోయిన పెళ్లి కూతురు.. పాపం వరుడి తండ్రి..
- రాత్రి 9:30 తరువాత అన్నీ బంద్.మంగళూరులో పోలీసుల ఆదేశం