రక్షక భటులు యాక్షన్ సీన్ చూపించారు. బజారులో బరి తెగించారు. పోట్ల గిత్తల్లా కమ్మేసుకున్నారు. నడి రోడ్డుపై బలప్రదర్శకు దిగారు. ముష్టి యుద్ధంతో సినిమా చూపించారు. ముఖాలు వాచిపోయేలా పిడిగుద్దులతో విరుచుపడ్డారు. చివరకు అలసి పోయి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ ఇద్దరి బాగోతాన్ని వీడియో చూపించింది. ఇద్దరు పోలీసులు నడి మీద కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పోలీసులపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. యానిమల్’ సినిమా ఫైట్ చూసినట్లు ఉందని సెటైర్లు వేస్తున్నారు.
నడిరోడ్డుపై ఇద్దరు పోలీసులు కొట్టుకున్న ఘటన అనంతపురం జిల్లా రోళ్ల మండలం పిలిగుండ్లు చెక్ పోస్టు వద్ద జరిగింది. అందరూ చూస్తుండగానే ఇద్దరు ఖాకీలు యూనిఫామ్‌లోనే కొట్టుకున్నారు. వాహనాల తనిఖీల కోసం పిలిగుండ్లు చెక్ పోస్టు వద్ద ఆదివారం సాయంత్రం రోళ్ల, అగళి పోలీసు స్టేషన్లకు చెందిన నారాయణ స్వామి నాయక్, శివకుమార్‌ను ఉన్నతాధికారులు నియమించారు. అయితే తనిఖీలు చేస్తుండగా ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. దీంతో కానిస్టేబుళ్లు ఒక్కసారి రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది
Also read
- లక్కీ డ్రాప్ కోసం ఫ్రెండ్స్ డిష్యుం..డిష్యుం.. పోయిన ప్రాణం..!
- కార్మిక చట్టాల అమలు కు దీక్షాదినంగా మేడే….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ భయం.. ఫలితాలకు ముందే విద్యార్ధిని ఆత్మహత్య!
- Telangana: శ్మశానంలోని బాత్రూమ్లో కనిపించిన నల్లటి కవర్.. దగ్గరికెళ్లి ఓపెన్ చేయగా
- అన్నా.. అని పిలిచినందుకు దాడి చేసిన ఎస్ఐ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..





