గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో దారుణం చోటుచేసుకుంది. కైలాష్ భవన్ రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద జూటూరి బుజ్జి (50) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. కైలాష్ భవన్ రోడ్డులోని ఓ టిఫిన్ సెంటర్ వద్ద జూటూరి బుజ్జి (50) అనే వ్యక్తిని దుండగుడు దారుణంగా హత్య చేశాడు. స్థానిక సమాచారం మేరకు.. గుర్తుతెలియని దుండగుడు కొబ్బరికాయలు కొట్టే కత్తితో నరికి బుజ్జిని చంపినట్లు తెలుస్తోంది. ఈ హఠాత్తు పరిణామంతో స్థానికంగా కలకలం రేగింది.
నడిరోడ్డుపై దారుణ హత్య..
వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతుడు అమర్తలూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బుజ్జి చెంచుపేటలో ఉన్న తన కూతురి ఇంటికి వచ్చి టిఫిన్ చేయడానికి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘోరం జరిగిందనట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండగుడు స్కూటీపై ముఖానికి మాస్కు ధరించి వచ్చి అత్యంత క్రూరంగా హత్య చేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు.
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే త్రీటౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేశారు. ఈ హత్యకు గల కారణాలపై.. పరారైన దుండగుడి కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పట్టపగలే నడిరోడ్డుపై జరిగిన ఈ హత్య తెనాలి ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దుండగుడిని త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Also read
- Telangana: అయ్యో దేవుడా.. పెళ్లైనా 6 నెలలకే ఇంత దారుణమా.. శాడిస్ట్ భర్త వేధింపులతో..
- Delhi Blast: కారు ఓనర్ పుల్వామా నివాసి.. ఢిల్లీ పేలుడు కేసులో సంచలన విషయాలు..
- Delhi Blast: అల్ ఫలా యూనివర్సిటీ నీడలో టెర్రరిస్టులు.. మొత్తం ఆరుగురు డాక్టర్లు అరెస్ట్!
- ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పురోగతి.. డాక్టర్లుగా పని చేస్తూ.Delhi blast Latest updates
- Delhi Blast: ఎర్రకోట దగ్గర పార్కింగ్‌లో 3 గంటలు వెయిటింగ్.. ఆ సూసైడ్ బాంబర్ ఇతనే..





