ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ వెంపాటి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన ఆమె అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది
YouTuber Madhumita : ఏపీకి చెందిన ప్రముఖ తెలుగు యూట్యూబర్ వెంపాటి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తాజాగా మధుమతి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజక వర్గంలోని విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామం లో ఉండే తన అమ్మమ్మ ఇంటికి వెళ్లగా.. అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఆమె మృతికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లాలోని విస్సన్నపేట మండల పరిధిలోని ఏ కొండూరు గ్రామానికి చెందిన మధుమతి (22) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమెకు లక్షల సంఖ్యలో అభిమానులున్నారని తెలుస్తోంది. తన యూట్యూబ్, ఇన్‌స్టా గ్రామ్‌లో లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే మధుమతికి అప్పటికే వివాహం అయిన ప్రతాప్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు ఇద్దరి మధ్య వివాహేతర బంధానికి దారి తీసింది.
అయితే, ఉన్నట్టుండి మధుమతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మధుమతి అక్కడే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవలసిన అవసరం ఏమోచ్చింది అనేది తెలియాల్సి ఉంది. కాగా, తమ కుమార్తె చావుకు తెల్లదేవరపల్లి గ్రామానికి చెందిన బోల్లిపోగు ప్రతాప్ కారణమని, ఆయనే మా కుమార్తె ను చంపి ఉరివేశాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు మధుమిత తల్లిదండ్రులు,వెంపాటి పాపారావు,లావణ్య. ప్రతాప్ టార్చర్ చేసి హత్య చేశాడని తమ కూతురు మరణానికి ప్రతాప్ కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని మధుమతి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





