SGSTV NEWS
CrimeTelangana

Wife Murder Husband: తెలంగాణలో ఘోరం.. ప్రేమించినోడ్ని కాటికి పంపిన భార్య.. నలుగురు పిల్లల సాయంతో


హన్మకొండ జిల్లా పెద్దపెండ్యాలలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య లక్ష్మి, నలుగురు పిల్లల సహకారంతో భర్త అశోక్‌ను చీరతో ఉరి బిగించి హత్య చేసింది. వివాహేతర సంబంధంపై నిలదీయడమే ఈ హత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణలో ఇటీవల కాలంలో కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధాల(Illegal Affair) కారణంగా విపరీతంగా క్రైమ్ రేట్ పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు వేధింపులు, వరకట్న సమస్యలతో హత్యలు జరిగేవి. కానీ ఇప్పుడు భార్యాభర్తల మధ్య అనుమానాలు, అక్రమ సంబంధాలు, చిన్న చిన్న గొడవలు కూడా ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంటున్నాయి. మేడ్చల్, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ వంటి జిల్లాల్లో భర్తలను భార్యలు చంపిన ఘటనలు, లేదా భార్యలను భర్తలు చంపిన ఉదంతాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. ముఖ్యంగా భర్త వేధింపులు లేదా మద్యానికి బానిస కావడం, లేదా భార్య వివాహేతర సంబంధాలు ఈ దారుణాలకు ప్రధాన కారణమవుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం కరువవడం.. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు పచ్చని కాపురాలను కకావికలం చేస్తున్నాయి.

Hanumakonda Murder
తాజాగా అలాంటి దారుణమైన ఘటన హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య యాదలక్ష్మి తన భర్త అశోక్ ప్రాణాలు తీయడానికి(wife murder husband news) ఏకంగా తమ నలుగురు పిల్లల సహాయం తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.

పెద్దపెండ్యాల గ్రామానికి చెందిన రాజారపు అశోక్, యాదలక్ష్మి ప్రేమించుకుని వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. కొద్దికాలం వీరి సంసారం సజావుగా సాగింది. కానీ ఆ తర్వాత కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. బంధువులు, స్థానికుల ఆరోపణల ప్రకారం.. భార్య లక్ష్మికి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త అశోక్ తరచూ ఆమెను ప్రశ్నించేవాడు. ఇదే విషయమై గురువారం సాయంత్రం కూడా ఈ దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

చిన్న గొడవ కాస్త పెద్దది కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన లక్ష్మి.. తన భర్త అశోక్‌ను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఈ దారుణానికి ఆమె ఏకంగా తమ నలుగురు పిల్లలను ఉపయోగించుకుంది. పిల్లల సహకారంతో లక్ష్మి.. తన భర్త అశోక్ మెడకు చీరతో ఉరి బిగించి హతమార్చింది. ఇక తండ్రి ప్రాణాలు తీసేందుకు కన్నతల్లికి పిల్లలు సహకరించిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

అనంతరం అశోక్ తండ్రి రాజారపు వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో హత్య వెనుక వివాహేతర సంబంధం, కుటుంబ కలహాలే కారణమని తేలినట్లు సమాచారం. దీంతో పోలీసులు భార్య లక్ష్మితో పాటు, ఈ దారుణానికి సహకరించిన నలుగురు పిల్లలను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also read

Related posts