SGSTV NEWS online
Astro TipsSpiritual

నేలపై కూర్చొని పూజ చేయకూడదంటారు ఎందుకు? దర్భాసనం విశిష్టత ఏంటి?



ఏ దైవ కార్యక్రమాన్ని చేస్తున్నా.. కటిక నేలమీద కూర్చోకూడదు. బదులుగా ఏదో ఒక ఆసనం తప్పనిసరిగా వేసుకోవాలి. ఆసనం లేకుండా జపతపాలు ఆచరించడం నిష్పలితాన్నిస్తుంది. అందుకే ఏదో ఒక ఆసనంమీద కూర్చోవాలని అంటారు. అన్నింట్లోకీ విశిష్టమైనది దర్భాసనం. భూమ్యాకర్షణ శక్తి సాధకుడి ప్రాణశక్తిని గుంజుతుందని, అందువల్ల వైదిక కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు నేల మీద కూర్చోకూడదని, అందుకే తగిన ఆసనం మీద కూర్చోవాలని- ధర్మగ్రంథాలు తెలియజేస్తున్నాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో కేతువు మోక్షకారకుడు. దానికి కారణం కేతు గ్రహానికి అధిదేవత బ్రహ్మదేవుడు. కేతువు అనుగ్రహానికి సూచించిన సమిధ దర్భ దర్భలతో ఆసనాన్ని అల్లుతారు. అందువల్ల దర్భాసనంపై కూర్చుని పూజ, జప, తప, ధ్యానాదులు చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఏవైనా గ్రహదోషాలు ఉంటే తొలగుతాయి. కేతువు అనుగ్రహంతో తపస్సు, మంత్ర కుశలత, బ్రహ్మజ్ఞానం, బుద్ధికుశలత సిద్ధిస్తాయి. ఒక్కోసారి పూజాదికాలకు సిద్ధమైనప్పుడు ఆసనాలు అందుబాటులో లేకపోవచ్చు. అప్పుడు కనీసం ఒక్క దర్భపులనైనా నేలపై ఉంచి, శుభ్రమైన తెల్లని వస్త్రం పరిచి.. దానిపై కూర్చుని పూజకు ఉపక్రమించవచ్చు.

స్త్రీలు దర్భాసనం పైన కూర్చుని పూజ చేయవచ్చా?

స్త్రీలు దాన్ని ఉపయోగించకూడదని చెబుతుంటారు కానీ అది అపోహ మాత్రమే. అయితే.. దర్భాసనం మీద తప్పనిసరిగా మరో ఆసనం అంటే తెల్లటి వస్త్రం లాంటిదాన్ని పరుచుకుని కూర్చోవాలి. ఇంట్లో మాత్రమే కాదు… పుణ్యక్షేత్రాలు దర్శించినప్పుడు కూడా ధ్యానం, పూజ లాంటివి చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆసనాన్ని వాడటం ( కనీసం – వస్త్రం అయినా పరుచుకోవడం) తప్పనిసరి నేలమీద కూర్చుని జపతపాల్ని చేస్తున్నప్పుడు భూమి వాటిని ఆకర్షించడం వల్ల సరైన ఫలితాలు అందవు. అందువల్లే పూజ, ధ్యానం ఏది చేస్తున్నా సరే… ఏదో ఒక ఆసనం ఉండేలా చూసుకోవాలి.

పూజా సామగ్రిని ముందురోజు శుభ్రంచేసుకుని పెట్టుకోవచ్చా?

సమయం ఉంటే సరే… లేనప్పుడు పూజా మందిరాన్ని ముందురోజు శుద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా పూజా సామగ్రిని- అంటే కుందులు, హారతి పళ్లెం వంటివన్నీ మర్నాటి పూజకు ముందే శుభ్రం చేసుకుని కూడా పెట్టుకోవచ్చు.

ముఖ్యంగా పండుగలూ, వ్రతాల సమయంలో అన్నీ ఇలా సిద్ధం చేసుకుంటే ఏ హడావుడీ, ఒత్తిడీ లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో పూజను పూర్తిచేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి సందేహమూ అక్కర్లేదు. అలాగే నిర్మాల్యం అంటే పూజలో ఉపయోగించిన పూల మాలలూ, ఇతర పూలూ తప్పక తీసేయాలి. అవి ఎంత తాజాగా అనిపించినా అస్సలు ఉంచకూడదు. నిర్మాల్యం భగవంతుడికి శిరోభారమని అంటారు.

Related posts