వైకాపా కార్యకర్త దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.
దుగ్గిరాల: గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో తెదేపా కార్యకర్త ఖాసీంపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్త క్రికెట్ బ్యాట్తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఖాసీంను కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీ గెలిచిందన్న సంతోషంతో సంబరాలకు సిద్ధమవుతున్న ఖాసీంపై కమల్ బ్యాట్తో దాడి చేశాడని మృతుని బంధువులు తెలిపారు. వైకాపా ఓటమిని తట్టుకోలేక నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని బాధితులు వెల్లడించారు. కమల్పై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బాధితులు హెచ్చరించారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025