దొంగలు చాలా తెలివి మీరిపోయారు. నేరం చేయడమే కాదు ఆధారాలు దొరక్కుండా పని పూర్తి చేసి పారిపోతున్నారు. తాజాగా ఓ ఏటీఎం సెంటర్లో దోచుకునే తీరు పోలీసులను కంగు తినేలా చేశారు. రాత్రి వేళ కారులో వచ్చి గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడి సుమారు రూ.17లక్షలు దోచుకెళ్లారు..ఈ ఘటన
అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ.17లక్షలు ఎత్తుకెళ్లారు. ఈ షాకింగ్ ఘటన అనకాపల్లి జిల్లాలోని పరవాడ దేశపాత్రునిపాలెంలో చోటు చేసుకుంది. గాజువాక- ఎలమంచిలి రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి 2నుంచి 3:30గంటల సమయంలో చోరీ జరిగినట్లు పరవాడ సీఐ బాలసూర్యారావు తెలిపారు. రాత్రి వేళ కారులో వచ్చిన దుండగులు..ముందుగా సీసీ కెమెరాల తీగలు కత్తరించి లోపలికి ప్రవేశించిన దొంగలు.. అనంతరం గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను కోసి అందులోని రూ.17లక్షలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతానికి పాల్పడ్డారు.
ఏటీఎం సెంటర్లో ఉన్న రెండు ఏసీలు 6 సీసీ కెమెరాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో సీసీ కెమెరాలు లో ఎటువంటి దృశ్యాలు రికార్డు కాలేదు. ఏటీఎం నిర్వహణ సంస్థ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి వచ్చి చూసేసరికి పోలీసులే కంగుతిన్నారు. పరవాడ డిఎస్పి సత్యనారాయణ ఏటీఎం సెంటర్ ని పరిశీలించారు. స్థానికంగా విచారించారు. దీంతో.. వేకువజామున ఏటీఎం సెంటర్ వద్ద ఒక కారు.. ఇద్దరు వ్యక్తులు మూట పట్టుకొని వెళ్లిపోయినట్టు ప్రాథమికంగా గుర్తించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల వైర్లను ముందే కత్తిరించినట్టు గుర్తించారు.
అయితే ఏటీఎం సెంటర్లలో ఏసీలు కాలిపోయిన ఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కట్టర్లతో ఏటీఎం మెషిన్ ను కట్ చేస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ తో కాలిపోయాయా.. లేక వెళ్తూ వెళ్తూ కాల్ చేశారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు ఏటీఎం మిషన్లు ఉన్నప్పటికీ ఒక దాన్నే టార్గెట్ చేయడం పైన అనుమానం వ్యక్తం అవుతుంది. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు.
Also read
- పోలీస్ స్టేషన్లో కాల్పుల కలకలం.. AK-47తో కాల్చుకుని ఎస్ఐ ఆత్మహత్యాయత్నం!
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!





