ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి యాత్రకు వెళ్లారు. అనంతరం దైవ దర్శనానికి బయలు దేరారు. అంతలోనే అనుకోని ఉపద్రవం ఎదురైంది. ఆదిబట్ల మున్సిపాలిటీ కొంగరకలాన్‌కు చెందిన ఓ కుటుంబం చేపట్టిన విహారయాత్ర విషాదాన్ని నింపింది. రోడ్డు ప్రమాదం రూపంలో బాలుడిని బలిగొన్న ఘటన స్థానికంగా కలచి వేస్తోంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాళ్ల దర్శన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం మూడు కార్లల్లో విహారయాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా భద్రాచలం నుంచి ములుగు జిల్లా మీదుగా తాడ్వాయి గుండా సమ్మక్క సారక్క వైపు వెళ్తుండగా మంగళవారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో తాళ్ల అరుణ్ కుమారుడు శబరీశ్(9) అక్కడిక్కడే మృతి చెందాడు.
కారు నడుపుతున్న అరుణ్, అతడి తండ్రి దర్శన్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరినీ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దర్శన్(60) పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తండ్రీతాతలు ఆస్పత్రిలో ఉండగా పిల్లాడి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధం చేశారు. దీంతో కొంగరకలాన్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Also read
- నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..
- అరేయ్ ఇలా ఉన్నారేంట్రా.. బైక్ దొంగల కలర్ ఫుల్ ప్లాన్.. కట్ చేస్తే, ఊరు చివర పొదల్లో..
- పోస్ట్ డెలవరీ డిప్రెషన్‌తో మహిళ ఆత్మహత్య? 6వ అంతస్తు నుంచి శిశువుతో దూకి..
- ఫ్రీగా బంగారాన్ని మెరిపిస్తామంటూ మాయ చేశారు! ఒంటరి మహిళను టార్గెట్ చేసి..
- నాగరాజును నమ్మింది.. నట్టేట మునిగింది.. ఏకంగా రాష్ట్రం దాటి వచ్చి..





