‘
చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కార్యాలయంపై మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. లోపలి వస్తువులను చిందరవందర చేసి, పలు దస్త్రాలకు నిప్పు పెట్టారు.
చిత్తూరు : చిత్తూరు నగరంలోని ఓ ప్రైవేటు కార్యాలయంపై మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. లోపలి వస్తువులను చిందరవందర చేసి, పలు దస్త్రాలకు నిప్పు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా తెదేపా కూటమి విజయం సాధించి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలోనే కీలకమైన ఫైల్స్‌కు నిప్పు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకునే ప్రైవేటు సంస్థలు కొన్ని ఇసుక, గనుల నుంచి ఖనిజాలు, గ్రానైట్ తదితరాల రవాణాకు సంబంధించి ట్రాన్సిట్ పాస్‌లు, రాయల్టీలు వసూలు చేస్తుంటారు. స్థానికంగా ఇలాంటి అనుమతులన్నీ అక్రమంగా సాగుతున్నాయని, ప్రభుత్వం మారాక దస్త్రాలు పరిశీలిస్తే లొసుగులు బయటపడతాయనే కారణంతో ఈ దారుణానికి ఒడిగట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యాలయం తెలంగాణకు చెందిన ఒక మంత్రికి సంబంధించినదని తెలుస్తోంది. దస్త్రాల కాల్చివేతపై కేసు నమోదు చేశామని, 30 మంది ఆగంతకులు చొరబడి లోపల ధ్వంసం చేసి నిప్పు పెట్టారని చిత్తూరు వన్‌లైన్ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.
Also read
- తెలంగాణ : పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే మూడు కార్లలో వచ్చి..
- క్షణికావేశం రెండు కుటుంబాలను ఛిన్నాభిన్నం చేసింది..అత్త కాటికి.. కటకటాల్లోకి వెళ్లిన కోడలు..!
- నకిలీ జీవోలతో ఏకంగా ప్రభుత్వ భూమినే అమ్మకానికి పెట్టి బుక్కయ్యారు
- Jyeshtha Pournami: జ్యేష్ఠ పౌర్ణమి ఎప్పుడో తెలుసా..? ఈ రోజు చేసే పూజలకు కోటిరెట్లు ఫలితం.. తప్పక చేయాల్సిన పనులు ఇవే!
- కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కోసం సంపూర్ణ పూజా విధానం





