కృష్ణా జిల్లా బందరు (మచిలీపట్నం): మండలంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని ముక్కలుగా నరికి మొండెం ఒక ఊరిలో.. కాళ్లు, చేతులు మరో ఊరిలో పడేశారు. వాటిని చూసిన రెండు ఊళ్ల జనం హడలెత్తిపోయారు. వివరాలు.. మచిలీపట్నం మండలం వాడపాలెం పంటకాలువలో బుధవారం గుర్తు తెలియని ఓ వ్యక్తి మొండెంను గ్రామస్తులు గుర్తించారు. తల, కాళ్లు, చేతులు లేకుండా మొండెం ఒక్కటే నీళ్లలో తేలుతూ కనిపించటంతో భయంతో వణికిపోయారు.
ఊరి పెద్దలు వెంటనే బందరు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అలాగే పీటీపాలెం మురుగు కాలువలో తల, కాళ్లు, చేతులు తేలుతూ కనిపించటంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు కూడా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలాలకు చేరుకొని ఆయా భాగాలను స్వాదీనం చేసుకున్నారు. సీఐ యేసుబాబు మృతుడి అవయవాలను మచిలీపట్నం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతునికి 40 ఏళ్ల వయసు ఉంటుందని సీఐ చెప్పారు. హతుడిని గుర్తించేందుకు, హంతకులను పట్టుకునే దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Also read
- తల, కాళ్లు చేతులు ఒక ఊరిలో.. మొండెం మరో ఊరిలో..
- కుమారుడి ప్రేమ వ్యవహారం.. మాట్లాడుకుందామని తండ్రిని పొలాల్లోకి తీసుకెళ్లి..
- Vijayawada: నీళ్ల బాటిల్ కోసం ఇంతటి దారుణమా? చేతులు వెనక్కి విరిచి స్తంభానికి కట్టేశారు.. చివరకు
- విహారంలో విషాదం.. సముద్ర తీరంలో కొట్టుకుపోయి ముగ్గురు యువతులు, యువకుడు మృతి!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





