SGSTV NEWS
Andhra PradeshCrime

Andhra: అక్రమ మైనింగ్ కేసులో ఏపీ మాజీ మంత్రి కాకాణి అరెస్ట్



క్వార్ట్జ్‌ అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం వంటి అక్రమాలపై పొదలకూరు పోలీసుస్టేషన్‌లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదైంది. గత కొంతకాలంగా పరారీలో ఉన్న కాకాణిని కేరళలో అదుపులోకి తీసుకున్నారు.


ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అయ్యారు. అక్రమ మైనింగ్ కేసులో ఏ4గా ఉన్న కాకాణిని నెల్లూరు పోలీసులు కేరళలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి నెల్లూరు తీసుకువచ్చే అవకాశం ఉంది.

కాకాణి గోవర్థన్‌రెడ్డికి సుప్రీంకోర్టులోనూ రిలీఫ్‌ దొరకని విషయం తెలిసిందే…! నెల్లూరు పోలీసుల సెర్చింగ్‌తో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనకు సుప్రీంకోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. క్వార్ట్జ్‌ గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆయన ముందస్తు బెయిల్‌ నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం. ఆయన తరుపు లాయర్లు ఎంత విన్నవించినా ముందస్తు బెయిల్‌ ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది. హైకోర్టు సైతం ముందస్తు బెయిల్ నిరాకరించడంతో… సుప్రీంకోర్టుకు వెళ్లిన కాకాణికి అక్కడా ఎదురుదెబ్బే తగిలింది.


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్ట్‌ను అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. గని లీజు కాలం ముగిశాక కూడా.. వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలొచ్చాయి. అంతేకాక రాళ్ళను పేల్చేందుకు పెద్దఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని కూడా పెద్ద ఇష్యూ అయింది. దీంతో ఫిబ్రవరి 16న మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. కాకాణిని ఏ4గా చేరుస్తూ విచారణకు రావాలంటూ 3సార్లు నోటీసులిచ్చారు అధికారులు. నెల్లూరు సహా హైదరాబాద్‌లోని కాకాణి ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులందజేశారు. అలా మూడుసార్లు నోటీసులిచ్చినా విచారణకు డుమ్మా కొట్టారు కాకాణి. అప్పట్నుంచి అంటే సుమారు 2నెలలుగా అజ్ఞాతంలోకి ఉన్నారు. తాజాగా కేరళలో పొలీసులకు చిక్కారు

Also read

Related posts

Share this