విజయవాడ గొల్లపాలెం గట్టు వద్ద విషాదం చోటుచేసుకుంది. బిస్కెట్ కొనుక్కుందామని మని వెల్లిన 8 ఏళ్ల బాలుడిని మృత్యువు వెంటాడింది. స్థానకంగా నివాసం ఉంటున్న 8 ఏళ్ల బాలుగు మానస్ షాప్‌లో బిస్కెల్ కొనుక్కొని వస్తుండగా విద్యుత్ స్తంభానికి తాకి కరెంట్ షాక్ గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు మానస్‌ను హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు.
షాప్‌కు వెళ్లి బిస్కెస్ కొనుక్కొని తిరిగి వస్తుండగా కరెంట్ షాక్ గురై ఎనిదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విజయవాడలోని గొల్లపాలెంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెలితే.. స్థానికంగా నివాసం ఉంటున్న 8 ఏళ్ల బాలుడు మానస్ బిస్కెట్ కొనుక్కుందామని ఇంటి నుంచి గొల్లపాలెం గట్టుకు వచ్చాడు. అక్కడ కస్తూరిబాయ్ ఆశ్రమం వద్ద ఉన్న బడ్డీ కొట్టులో బిస్కెట్లు కొనుగోలు చేసే తిరిగి వచ్చే సమయంలోనే పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని తగలడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురయ్యాడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అయితే, బాలుడు కరెంట్ స్తంభం పక్కన పడిపోయి ఉండడాన్ని గమనించిన స్థానికులు, అక్కడికి చేరుకొని మానస్ హుటాహుటిన స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మానస్ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. వైద్యులు ఈ విషయాన్ని అ బాలుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. బాలుడి మరణ వార్త విన్న తల్లి దండ్రలు ఒక్క సారిగా షాక్ అయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కొడుకు బిస్కెట్ కోసమని వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కన్నిమున్నీరుగ విలపిస్తున్నారు. ఆ తల్లి రోధన చూసి స్ధానిక జనం కూడా కంటతడి పెట్టుకున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు
Also read
- చంద్రిక నన్ను క్షమించు.. నీకు ఇచ్చిన మాట తప్పాను
- Andhra News: నిత్యం తాగొచ్చిన తల్లిని వేధిస్తున్న తండ్రి.. తల్లి బాధ చూడలేక కొడుకు ఏం చేశాడంటే?
- Warangal: అత్త బంగారంపై కన్నేసిన అల్లుడు.. వాటిని కాజేసేందుకు ఏం చేశాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
- Chittoor: తాగునీటిని పట్టుకునేందుకు వచ్చిన గ్రామస్తులు.. అక్కడ కనిపించిన సీన్ చూడగానే..
- Air India: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో సైబర్ దాడి కోణం..? ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాక్ చేసి..