SGSTV NEWS online
CrimeTelangana

తండ్రి మరణాన్ని తట్టుకోలేక..



రంగారెడ్డి జిల్లా: బంధాలు, అనుబంధాలే కరువైపోతున్న ఈ  రోజుల్లో తండ్రి మీద ఆ కుమా రు డు పెంచుకున్న మమకారం ఏకంగా ప్రాణాలనే తీసుకునేలా చేసింది. కుమారుడిని అలా చూసిన తల్లి కూడా తనువు చాలించింది. ఈ విషాద ఘట న రంగారెడ్డి జిల్లా లష్కరూడ పంచాయతీ కనకదుర్గానగర్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది.

వరంగల్ జిల్లాకు చెందిన పసుల కళాధర్, కళావతి దంపతులు తమ కుమారుడు శివకుమార్తో కలిసి మేడ్చల్లో ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ టైలరింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తు న్నారు. ఈ క్రమంలో అనారోగ్యానికి గురైన కళాధర్ ఆరు నెలల క్రితం మృతిచెందారు. దీంతో శివకుమార్ను తీసుకుని కళావతి లష్కర్గూడలో ఉంటున్న తన సోదరుడి వద్దకు వచ్చారు. ఇక్కడే ఓ అద్దె ఇంట్లో ఉంటూ కాలం గడుపుతున్నారు. అ యితే, తండ్రి మరణం శివకుమార్(20)కు మాన సికంగా కుంగదీసింది.

తండ్రితో అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నిత్యం తల్లడిల్లేవాడు. ఈ క్ర మంలో తీవ్ర మనోవేదనతో బుధవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత తల్లి కళావతి(45) కొడుకు చనిపోయి ఉండటాన్ని గమనించారు. ఆరునెలల క్రితం భర్త చనిపోవడం, ఇప్పుడు కొడుకు ఆత్మహ త్య చేసుకోవడం చూసి తట్టుకోలేకపోయారు. వా రిద్దరూ లేని జీవితం ఎందుకు అనుకున్నారేమో.. ఆమె కూడా చీరతో ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేశారు.

Also read

Related posts