స్నేహితురాళ్ల అశ్లీల ఫొటోలు తీసి ప్రియుడికి పంపిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి టౌన్ ప్రాంతానికి చెందిన మకరజ్యోతి (39) అనే మహిళకు వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయిన ఆమె, పాలయంకోట్టైలోని ఒక ప్రైవేట్ మహిళా హాస్టల్లో గది అద్దెకు తీసుకుని ఉంటోంది. ఆ సమయంలో కోయంబత్తూరుకు చెందిన ఒక యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది.
ఈ క్రమంలో హాస్టల్లో తనతో పాటు ఉంటున్న ఇతర మహిళల రోజూవారి కార్యకలాపాలను వారికి తెలియకుండానే మకరజ్యోతి సెల్ఫోన్లో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా తీసిన అశ్లీల చిత్రాలను ఆమె కోయంబత్తూరులో ఉన్న తన ప్రియుడికి పంపుతున్నట్టు తెలిసింది. హాస్టల్ యజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, మహిళా పోలీసులు విచారణ చేశారు. విచారణలో తోటి మహిళలను అశ్లీలంగా ఫొటోలు తీసినట్లు నిర్ధారణ కావడంతో, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
-చెన్నై
Also read
- ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!
- Ananthagiri Hills: అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ.. ఆ తర్వాత నిమిషాల్లోనే..
- భాగ్య, హన్నమ్మ మామూలు లేడీస్ కాదమ్మ.. బస్టాండ్లో వాళ్ల కంట పడ్డారో అంతే సంగతులు..
- కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..! క్రైమ్ స్టోరీని మించిన స్కెచ్..
- ఆరు హత్యకేసుల నిందితుడు రాజ్ కుమార్ మృతి





