కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలల్లో ఓ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న దుంపటి వినయ్ కుమార్ (31) ఉగాది పండుగ రోజున ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాలేదు.
అతడి కోసం బంధువులు గాలిస్తుండగా.. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినయ్ మృతికి గల కారణాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.
రూపురేఖల్లోనే కాదు, మనస్తత్వాల్లోనూ ఈ రెండు జంటల మధ్య చక్కని అవగాహన కుదరడంతో పెద్దలు పెళ్లి నిశ్చయించారు. ఒకే ముహూర్తానికి విజయ్- కీర్తన, వినయ్-కీర్తి పెళ్లి జరిగింది. పెళ్లి జరిగి నెల కూడా తిరక్కుండానే కీర్తి భర్త వినయ్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
Also read
- Hyderabad: అతన్ని గుడ్డిగా నమ్మింది.. హోటల్‌కు వెళ్లింది.. కట్‌చేస్తే.. అసలు మ్యాటర్ తెలిసి..
- అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన శివలింగం- ప్రొద్దుటూరులో అరుదైన నవగ్రహ మండపం విశేషాలివే!
- తల్లి మృతిని తట్టుకోలేక.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
- లాయర్ అయితే నాకేంటి.. చంపకుండా ఇక్కడి నుంచి వెళ్లను!’
- రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ డీసీపీ కుమార్తె మృతి




