అమీర్‌పేట్ లోని ఓ గర్ల్స్ హాస్టల్లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఓ యవతి వీడియో రిలీజ్ చేయడం షాకింగ్ గా మారింది. లేడీస్ హాస్టల్ ముసుగులో తప్పుడు పనులు జరుగుతున్నాయని ఆరోపించింది.
అమీర్‌పేట్ లోని ఓ గర్ల్స్ హాస్టల్లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ ఓ యవతి వీడియో రిలీజ్ చేయడం షాకింగ్ గా మారింది. లేడీస్ హాస్టల్ ముసుగులో తప్పుడు పనులు జరుగుతున్నాయని ఆరోపించింది. తాను గతేడాది నెల రోజులు ఉండేందుకు ♡ పీజీలో చేరానని కానీ పదిహేను రోజుల్లోనే అక్కడి నుండి వెళ్లిపోయినట్టు తెలిపింది. పీజీలో వసతులు సరిగ్గా లేవని, ఆహారం కూడా సరిగ్గా పెట్టరు అని ఆరోపించింది. అంతే కాకుండా హాస్టల్ గదిలోకి ఓనర్ తరచూ వస్తుంటాడని, అమ్మాయిల రూంలోకి రావడం ఏంటి అంటే ఇక్కడ ఇలానే ఉంటుంది ఉంటే ఉండు పోతే పో అంటూ హెచ్చరించారని చెప్పింది. ఓనర్ కూడా తన ఫోన్ నంబర్ అడిగాడని ఆరోపించింది. అంతే కాకుండా ఆ హాస్టల్ లో అమ్మాయిలను అబ్బాయిలకు సప్లై చేస్తారు అని చెప్పేవారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ హాస్టల్ నిర్వహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరింది.
Also read
- టీచర్ కొట్టడంతో యూకేజీ విద్యార్థి మృతి
- Weekly Horoscope: ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. ఈ రాశులకు గోల్డెన్ టైమ్..!
- యువతి రిప్లే ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య!
- విశాఖ షీలానగర్‌లో మృతదేహాల కలకలం!
- బాడీకి బాంబుల్లా కట్టుకున్నారు.. లోపల ఏముందో చూసి పోలీసులే షాక్!





