తిరుపతి జిల్లా కేవిబిపురంలో దారుణం జరిగింది. అల్లుడు కోసం కూతురుపై రోకలి బండతో మోది చంపేసింది ఓ కిరాతకపు తల్లి. కేవిబీపురంలో గ్రామంలో ఐదు నెలల క్రితం18 ఎళ్ళ బాలుడికి,15 ఎళ్ళ మైనర్ బాలికకు ప్రేమ పెళ్లి జరిగింది.
తిరుపతి జిల్లా కేవిబిపురంలో దారుణం జరిగింది. అల్లుడు(son-in-law) కోసం కూతురుపై రోకలి బండతో మోది చంపేసింది(Mother Attack On Daughter) ఓ కిరాతకపు తల్లి. కేవిబీపురంలో గ్రామంలో ఐదు నెలల క్రితం18 ఎళ్ళ బాలుడికి,15 ఎళ్ళ మైనర్ బాలికకు ప్రేమ పెళ్లి(love-marriage) జరిగింది. మైనర్ బాలిక తల్లి సైతం అల్లుడుతో కలసి ఒకే ఇంట్లో ఉంటుంది. ఈ క్రమంలో అల్లుడితో అత్తకు అక్రమ సంబంధం ఏర్పడింది. శుక్రవారం రాత్రి భార్య పక్కన ఉండగా వారిద్దరూ పెళ్లి చేసుకోబోయారు. ఈ క్రమంలో తల్లి మెడలో తాళి కడుతున్న భర్తను చూసి బాలిక అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమె తల్లి, భర్త బాధితురాలిపై దాడి చేశారు. రోకలి బండతో తలపై మోదడంతో ఆమె కేకలు విని స్థానికులు వచ్చి రక్షించారు. అత్త, అల్లుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. గాయాలపాలైన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
Also read
- Garuda Purana: గరుడ పురాణం హెచ్చరిక.. ఈ 5 రకాల వ్యక్తులతో ఉంటే కష్టాలు, అపజయాలు తప్పవట!
- Weekly Horoscope: వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశులకు వారఫలాలు
- అవినీతి,అక్రమాల మయంగా మారిన “Ap.బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ”…
- హైదరాబాద్లో తీవ్ర విషాదం.. ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య!
- రాత్రి హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన భార్య.. తెల్లారే సరికి కనిపించని భర్త.. అసలు ట్విస్ట్ తెలిస్తే..





