SGSTV NEWS online
Andhra Pradesh

అవినీతి,అక్రమాల మయంగా మారిన “Ap.బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ”…

*గత వైసిపి ప్రభుత్వం లో బ్రాహ్మణ సొసైటీ నిధులు బినామీ పేర్లతో గోల్ మాల్ జరిగితే కూటమి ప్రభుత్వం పట్టించుకునే విధానం ఇదేనా…??*

*బ్రాహ్మణులు దాచుకున్న డబ్బు, బంగారానికి దిక్కెవరు…?? రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గాడిదలు కాస్తున్నారా…??*

1. బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీలో 2016 నుండి 17దాకా సీఈవోగా పనిచేసిన అబిజిత్ హయాంలో శ్రీకాకుళం లో పప్పు ఉండల ఫ్యాక్టరీకి ఇచిన సొసైటీ నిధులు గోల్ మాల్ పై ఏమి చర్యలు తీసుకున్నారు..??

2. అబ్జిత్ ను సీఈవోగా తొలగించిన తరువాత కోపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి సీఈఓ గా నియమించిన నాగ సాయి ఇప్పటికే ఎన్నాళ్ళ నుంచి ఈ సొసైటీలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్ మీద ఉద్యోగం చేయుచున్నాడు… ప్రభుత్వ సర్వీస్ రూల్స్ ఇతనికి వర్తించవా…??

3. ఈ బ్రాహ్మణ కోఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఆడిటింగ్ ఎవరు చేత చేయిస్తున్నారు.. సొసైటీ బ్రాంచ్ కార్యాలయాల్లో ఆడిటింగ్ ఎవరి చేత చేయిస్తున్నారు..?? ఆ సంస్థ ఏంటి…?? ప్రభుత్వం నిబంధనల ప్రకారం అలా చేయించే అవకాశం ఉన్నదా…??

4. ఈ సొసైటీలో సీఈవో పనిచేస్తున్న నాగసాయి తన పేరుతో ఎన్ని కార్లు లోను తీసుకున్నాడు ఎన్నాళ్ళగా పెండింగ్ లో ఉన్నాయి..??

5. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి సర్వేస్ రూల్స్ కు విరుద్ధంగా ఉద్యోగం చేయవచ్చా..??

6. విశాఖ బ్రాంచ్ లో ఈ సొసైటీ కి సంబంధించిన ఒక ఉద్యోగిని పేరుతో సూచి ఫుడ్స్ లోను ఎన్ని కోట్ల రూపాయలు ఎప్పుడు తీసుకున్నారు, ఎప్పుడు ప్రారంభించారు.

7. ఈ సొసైటీ మహాజన సమావేశం ఎన్నాళ్లయింది నిర్వహించి..

8. సొసైటీ బయిలాలకు విరుద్ధంగా సీఈఓ ప్రవర్తిస్తున్నప్పుడు చర్యలు ఎవరు తీసుకోవాలి…

9. సొసైటీ ఎన్నికలను అకారణంగా గత వైసిపి ప్రభుత్వంలో ఎందుకు నిలిపివేశారు ఆ కారణాలు ఏమిటి…???

10. సొసైటీలో గత ycp ప్రభుత్వంలో బినామీ పేర్లతో లోన్లు తీసుకున్న వారి మీద చర్యలు చేపట్టరా..??

11. ఇప్పుడున్న సీఈఓ నాగసాయి ని రెండు నెలల క్రితం ప్రభుత్వం తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది… ఈ విషయం స్టేట్ వార్త పత్రికలన్నిటిలో వార్త వచ్చింది.. వార్త వచ్చిన, కూటమి ప్రభుత్వం తొలగించిన నెలకే అదే సీఈవో ను ఇదే సొసైటీలో నియమిస్తూ జీవో ఎలా వచ్చింది.. ఆ జీవో తెచ్చిన నేతలు ఎవరు… కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఆ ముసుగు వీరులు ఎవరు…..??

12. బ్రాహ్మణులు దాచుకున్న కోట్ల రూ/- ల డబ్బు డిపాజిట్లు, బంగారం, ఆస్తిపత్రాలకు  హామీ ఎవరు ఇస్తారు… కూటమి ప్రభుత్వమా..?? సీఈఓ నా…?? బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ నా…??

13. బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి సీఈవో గా నిష్పక్షపాతంగా పనిచేయటానికి ఈ విభజిత రాష్ట్రంలో బ్రాహ్మణ ప్రభుత్వ అధికారులే లేరా…???

*దొంగలు దొంగలు కలసి సొసైటీని పంచుకుంటారా…??*

*🔥ప్రశ్నించే గొంతుక🔥*

Related posts