చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సముద్రంలో చేపలు పడుతుండగా ఒక చేప ఎగిరొచ్చి అతడి కడుపులో పొడిచింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ మత్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని కార్వర్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సముద్రంలో చేపలు పడుతుండగా ఒక చేప ఎగిరొచ్చి అతడి కడుపులో పొడిచింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ మత్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని కార్వర్‌లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని కార్వర్‌కు చెందిన మత్స్యకారుడు అక్షయ అనిల్ మజలికర్ (24) అక్టోబర్ 14న తన బృందంతో కలిసి అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. ఆ సమయంలో బోటు అంచున అక్షయ అనిల్ కూర్చున్నాడు. అదే సమయంలో నీళ్లలో నుంచి ఎగిరి వచ్చిన ఒక చేప.. దాని సూదిలాంటి నోటితో అనిల్‌ను పొడిచింది.
అనిల్‌ను పొడిచిన చేపను కందె రకమని చెబుతున్నారు. ఈ చేప నోరు 8 నుంచి 10 అంగుళాల పొడవుతో మొనదేలి ఉంటుంది. అందువల్లే సముద్రంలోని నీటిలో ఎగిరిన చేప ప్రమాదవశాత్తూ.. అనిల్ కడుపులో గుచ్చుకుంది. దీంతో అనిల్ పేగులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల కారణంగా తీవ్ర రక్తస్రావం కావడంతో అనిల్‌ను వెంటనే ఒడ్డుకు తీసుకొచ్చి కార్వర్‌లోని క్రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స అందించారు. అయితే రెండు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం కన్నుమూశాడు. కాగా, అనిల్ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుడు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
Also read
- విష్ణుమూర్తి నాభి నుంచే పద్మం ఎందుకు పుట్టింది? బ్రహ్మదేవుడి ఆవిర్భావం వెనుక అసలు రహస్యం ఇదే!
- దుర్ముహూర్తం అంటే ఏమిటి? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? కారణం ఇదే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- ప్రియుడితో వెళ్లి.. శవమై తేలిన వివాహిత.. హత్య మిస్టరీని ఛేదించిన పోలీసులు!
- Hyderabad: డబ్బు తీసుకుంది కొడుకు.. చంపింది మాత్రం తండ్రిని.. అసలు ఏం జరిగిందంటే?





