అనంతపురం డ్రైవర్స్ కాలనీలో వివాహేతర సంబంధం నేపథ్యంలో తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ప్రియుడు నరేశ్ తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ఆగ్రహించిన వివాహిత అతడిపై దాడి చేసి మర్మాంగాన్ని కోసినట్లు సమాచారం. తీవ్ర గాయాలైన నరేశ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఏ తల్లి అయినా తన కూతురి జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తుందనే విషయానికి అనంతపురంలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తి.. తన కుమార్తెపై అసభ్యంగా ప్రవర్తించాడనే ఆగ్రహంతో ఓ మహిళ అతడి మర్మాంగాన్ని కోసిన ఘటన అనంతపురం నగరంలో చోటుచేసుకుంది. అనంతపురం నగరంలోని డ్రైవర్స్ కాలనీకి చెందిన సునీత.. తాడిపత్రికి చెందిన సురేష్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. సురేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. సురేష్ మద్యం మత్తులో సునీత కుమార్తెపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహానికి గురైన సునీత, కత్తితో అతడి మర్మాంగాన్ని కోసింది. ఈ ఘటన సమయంలో సునీత కుమార్తె కూడా ఆమెకు సహకరించినట్లు సమాచారం. తీవ్ర రక్తస్రావానికి గురైన సురేష్‌ను స్థానికులు వెంటనే అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం సునీత స్వయంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘటన అనంతరం సునీత స్వయంగా అనంతపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాధితుడు, మహిళ, ఆమె కుమార్తె వాంగ్మూలాలను నమోదు చేస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు, దాడికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన అనంతపురం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also read
- Telangana: ఆధార్ కార్డు అప్డేట్ చేస్తామంటూ.. ఇంట్లో మొత్తం దోచేశారు..
- ప్రముఖులతో ఫొటోలు.. చేతిలో ఫేక్ ఐడీ.. డీఐజీ అంటూ భార్యాభర్తల లక్షల దందా!
- అన్నం పెట్టిన బ్యాంకుకే కన్నం.. రూ. 90 లక్షల బంగారం మాయం! ఎవరో తెలిసి షాక్!
- డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం
- వారఫలాలు: ఆ రాశుల వారికి ఇక తిరుగులేదు.. ఏ పనిచేసినా సక్సెసే.. ఇందులో మీ రాశి ఉందా..?





